కన్నడ హీరో శ్రీ మురళి నటిస్తున్న తాజా చిత్రం బఘిర స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ కథ అందించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ డాక్టర్ సూరి దర్శకత్వం వహించారు. కే జి ఎఫ్ చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించిన నిర్మాణ సంస్థ హోంబలే బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఇందులో ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్ , గరుడ రామ్ వంటి యాక్టర్స్ నటించారట. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది.


తెలుగు, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. బఘిర చిత్రం  నుంచి తాజాగా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు.. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. అమ్మ దేవుడు రామాయణం మహాభారతం లో మాత్రమే వస్తారా.. ఇప్పుడు ఎందుకు రాడు అని తల్లిని కూతురు అడుగుతున్నప్పుడు.. ఆ తల్లి దేవుడు అన్నిసార్లు రాడు సమాజంలో పాపాలను సైతం మితిమీరినప్పుడే మంచి చెడును తొక్కేసినప్పుడే మృగాలను వేటాడే రాక్షసుడులా వస్తాడు అని డైలాగ్ తో బఘీర ట్రైలర్ మొదలవుతుంది.


బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కూడా అందరిని ఆకట్టుకుంటోంది.హీరో శ్రీ మురళి మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే మధ్యలో హీరోయిన్ తో లవ్ ట్రాక్ కూడా చూపించారు. మొత్తానికి ట్రైలర్ తోనే కేజిఎఫ్ తరహాలో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా చూపించారు. అలాగే డైలాగ్స్ కూడా చాలా పవర్ ఫుల్ గానే రాసినట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు లొకేషన్స్ అన్నీ కూడా కాస్త కేజిఎఫ్ సినీమా తరహాలోనే కనిపిస్తున్నాయి. మరి మొత్తానికి కేజిఎఫ్ చిత్రం లాగే బ్లాక్ బస్టర్ విజయాన్ని బఘిర సినిమా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి. ప్రస్తుతం ట్రైలర్ అయితే వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: