ముంబై బోరివాలిలోని ఎంహెచ్బి పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి వీరిపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు పోలీసులు. 2021 ఫిబ్రవరి - ఏప్రిల్ మధ్య ఆల్ట్ బాలాజీలో ప్రసారమైన గంధీ బాత్ వెబ్ సిరీస్ లో మైనర్ బాలికలను అభ్యంతరకర సన్నివేషాల్లో చూపించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సిరీస్ ప్రసారం నుంచి అనేక రకాల వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ వివాదాస్పద ఎపిసోడ్ ని యాప్ లో స్ట్రీమింగ్ నుంచి తొలగించడం జరిగింది. గొప్ప వ్యక్తులతో పాటు సాధువులను సైతం అవమానించారని సదరు వ్యక్తి ఆరోపణలు చేశాడు. సన్నివేశాలు అభ్యంతరకరమని, మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. పోక్సో నిబంధనలు ఉల్లంఘించే సన్నివేశాలు ఉన్నాయని చెప్పారు.
పోక్సోతో పాటు సమాచార సాంకేతిక చట్టం-2000, మహిళా నిషేధ చట్టం 1986, పొగాకు ఉత్పత్తుల చట్టం 2003 తదితర చట్టాలను ఉల్లంఘించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో పిల్లలకు సంబంధించి అభ్యంతర కంటెంట్ పై సుప్రీంకోర్టు ఈ సంవత్సరం సెప్టెంబర్ లో కీలక ఆదేశాలు చేసిన సంగతి తెలిసిందే. పిల్లల అశ్లీల కంటెంట్ చూసినా, డౌన్లోడ్ చేసినా, షేర్ చేసినా పెద్ద నేరమని స్పష్టం చేశారు.