మన లైఫ్ లో కి కొంతమంది చెప్పి వస్తారు . కొంతమంది చెప్పకుండానే వస్తారు. చెప్పి వచ్చినా చెప్పకుండా వచ్చిన ఆ వ్యక్తులు మనకు మంచి చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు.  అయితే మనం ఎంతో ఇష్టంగా నమ్మకంగా నమ్మి .. ఆ వ్యక్తులపై ప్రేమ పెంచుకొని.. మన లైఫ్ కి వాళ్లే అన్ని అని భావించిన తర్వాత ఆ వ్యక్తులు మనల్ ని చీట్ చేస్తే.. నమ్మించి మోసం చేస్తే..  ఆ బాధ వర్ణాతితం . ఎవరికి చెప్పుకోలేనిది . ఎంతమంది సర్ది చెప్పినా ఆ బాధ తీర్చలేనిది . అయితే అలాంటి ఒక టఫ్ సిచువేషన్ ని ఫేస్ చేసింది సమంత అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. హీరోయిన్ సమంత లైఫ్ ప్రెసెంట్ ఎలా ఉందో మనకు తెలిసిందే.

ఒకపక్క సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న మరొకపక్క అవి ఏవి నాకు సంబంధం లేదు అంటూ తన ప్రెస్టీజియస్ వెబ్ సిరీస్ సిటాడిల్ ప్రమోషన్స్లో బిజీబిజీగా ముందుకెళ్తుంది. కాగా ఇలాంటి క్రమంలోనే సమంతకు సంబంధించిన పలు రకాల వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.  మరి ముఖ్యంగా సమంత తన లైఫ్ లో నమ్మిన ఇద్దరు మగ వ్యక్తులకు సంబంధించిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . సమంత తన కెరీర్లో చాలామంది హీరోలతో నటించింది.  కానీ ఆమె లైఫ్ లో మాత్రం ఆ ఇద్దరే మోస్ట్ స్పెషల్.


వాళ్లల్లో ఒకరు హీరో సిద్ధార్ధ్.. మరోకరు హీరో నాగచైతన్య . సమంత హీరో సిద్ధార్థ్ ను ప్రేమించింది. వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు అని ..ఆ కారణంగానే జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవాలి అంటూ శ్రీకాళహస్తి గుడిలో పూజ కూడా చేయించారు అని అప్పట్లో ప్రచారం జరిగింది.  అంతేకాదు వాళ్ళిద్దరూ కలిసి గుడిలో పూజ చేస్తున్న పిక్చర్స్ కూడా బయటకు వచ్చాయి . ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు . నాగచైతన్యతో లవ్ అంటూ అక్కినేని ఇంటికి కోడలుగా మారిపోయింది సమంత .

ఆ టైంలో పరోక్షకంగా సిద్ధార్ధ్ పెట్టిన పోస్టులు ఏ విధంగా వైరల్ అయ్యాయో మనం చూసాం. అయితే సమంత అదృష్టమో దురదృష్టమో నాగచైతన్యతో కూడా బ్రేకప్ చెప్పేసుకుంది. నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు సింగిల్ లైఫ్ కింగ్ లైఫ్ అంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే సమంత కెరియర్ లో ఇది మైనస్ అని చెప్పుకునే నెగిటివ్ పాయింటే లేదు . అలాంటి నెగిటివ్ పాయింట్స్ ఏదైనా ఉన్నాయి అంటే కచ్చితంగా అది హీరో సిద్ధార్థ్ హీరో నాగచైతన్య ఎపిసోడ్స్  మాత్రమే. ఆ ఇద్దరు సమంత లైఫ్ కి శని ఎపిసోడ్స్ లా దాపరించారు అంటూ సమంత ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు . మరి కొందరు మాత్రం సమంత చీట్ చేసిందో..? వాళ్ళు చీట్ చేశారో..? నిజానిజాలు ఎవరికి తెలుసు .. వాళ్లకే తెలుసు అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: