కంగనా రనౌత్ గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన నటన, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం సోషల్ మీడియాలో కంగన పేరు మనకి వినబడుతూనే ఉంటుంది. ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కంగనా ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలతోనే జనాలకు చేరువ అయ్యింది. అత్యంత బీద కుటుంబం నుండి వచ్చిన కంగనా, బాలీవుడ్లో పెద్ద పెద్ద తలకాయలతో పోటీపడి మరీ తన ఉనికిని చాటుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక అడపాదడపా పొలిటికల్ విషయాలమీద కూడా కామెంట్స్ చేస్తూ మెల్లగా రాజకీయ రంగంలో కూడా ఎంటర్ అయ్యింది.

ఇక ఆమె దర్శక నిర్మాతగా వ్యవహరించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు సంబంధించిన వివాదం తెరపై ఉండగానే... ఆమె సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచారు. కాగా ఆ పోస్టుకి స్టార్ హీరోయిన్ సమంత కూడా మద్దతు తెలిపి హాట్ టాపిక్ అయింది. విషయం ఏమిటంటే, ఒక సోషల్ మీడియా వినియోగదారుడు "మంత్రగత్తెలకు భయపడవద్దు! వారిని కాల్చిన వారికి భయపడండి!" అంటూ పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది. ఈ పోస్ట్ రిప్లై‌గా కంగనా ఒక పోస్ట్ ని కోట్ చేసింది. "మంత్రగత్తెలు తమ ఉన్నత స్వభావానికి, అంతర్ దృష్టికి ప్ర‌సిద్ధిగలవారు. వారు స్వేచ్ఛా స్ఫూర్తిని నింపుకున్న ధైర్యమైన మహిళలు. లొంగని సంకల్ప శక్తి , హద్దులను ఛేదించాలనే అనియంత్రిత కోరికతో ఎల్లపుడూ ఉంటారు. ర‌హ‌స్యంగా పంజరంలో ఉండి భయప‌డే వారిని వారు మేల్కొలుపుతారు!" అనేది ఆ కోట్ సారాంశం.

దీనిని కోట్ చేసిన కంగనా నేను కూడా ఓ మంత్ర‌గ‌త్తెని అని రాసుకొచ్చింది. దీనికి హీరోయిన్ సమంత మద్దతు తెలుపుతూ.. తన సోషల్ మీడియా అకౌంట్ పోస్ట్ చేయడంతో అది కాస్త ఇపుడు వైరల్ అవుతోంది. దాంతో సదరు పోస్టుని చూసిన సోషల్ మీడియా జనాలు వారి ఇద్దరినీ మంత్రగత్తెలేనంటూ కామెంట్స్ చేయడం కొసమెరుపు. ప్రస్తుతం కంగనా నటించి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం విడుదలకు సంబంధించిన వివాదం నడుస్తోంది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ విషయంలో ఒక నిర్ణయానికి రావాలని ముంబై హైకోర్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్స్‌ సర్టిఫికేషన్‌ ఇటీవల ఆదేశించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్‌ 6న విడుదల కావాల్సి ఉంది. చిత్రంలో తమని తక్కువగా చూపించారని.. విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్‌ న్యాయస్థ్థానాన్ని సంప్రదించిన సంగతి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: