అక్కినేని నటవారసత్వం అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాలీవుడ్ హీరోలను సైతం తలదంన్నెంత అందంగా ఉంటాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ అఖిల్ కు ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి కూడా సాలిడ్ దక్కలేదని చెప్పవచ్చు. ఏజెంట్ సినిమా పరవాలేదు అనిపించిన మిగతా సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాలను మూటగట్టుకున్నాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో అఖిల్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

దీంతో తన తదుపరి ప్రాజెక్టు ఏంటన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఈ సారైనా అఖిల్ హిట్ కొడతాడా లేదా అన్న క్యూరియాసిటీ పెరిగిందని అంటున్నారు. ఈ తరుణంలోనే అక్కినేని అఖిల్ నటించబోయే కొత్త సినిమా కథ గురించి ప్రచారాలు జరుగుతున్న సమయంలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన గోవింద గోవింద సినిమా తరహాలోనే అఖిల్ సినిమా కూడా ఉండబోతుందట.


ఫాంటసీ ఎలిమెంట్లతో ఈ సినిమా తెరకెక్కనుందని అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. కింగ్ నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందిన గోవింద గోవింద సినిమా సైతం తిరుపతి బ్యాక్ డ్రాప్ లోనే వచ్చింది. అందులో వర్మ తనదైన శైలిలో ఫాంటసీ సీన్లు యాడ్ చేసి డిఫరెంట్ సబ్జెక్టుగా మార్చాడు. తిరుమల దేవాలయం అందులోని శ్రీవారి ఆభరణాలు విగ్రహం నేపథ్యంలో ఈ సినిమా సాగుతోంది.


ఇప్పుడు అఖిల్ నటించిన సినిమా కూడా ఇదే తరహాలో ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్త తెలిసిన వారంతా అఖిల్ చేసేది నాగార్జున సినిమా రీమేకా అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా అఖిల్ తన తదుపరి సినిమా అయినా మంచి హిట్ అందుకోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. మరి తన తర్వాతి సినిమాతోనే అయినా అక్కినేని నటవారసత్వం అఖిల్ హిట్‌ అందుకుంటాడో లేదో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: