ఇక చాలా సినిమాల్లో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తర్వాత పలు షోల్లో జడ్జిగా కూడా వ్యవహరించారు రోజా. రాజకీయాల్లో కూడా బానే రాణించారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ తో మనవరాలుగా చేసిన శ్రీదేవి ఆయన పక్కన హీరోయిన్గా చేసింది.. ఎన్టీఆర్ - శ్రీదేవి కాంబినేషన్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అలాగే మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా రజినీకాంత్ సినిమాలు నటించింది.. తర్వాత ముత్తులో ఆయనకు హీరోయిన్గా చేసింది. ఇక రోజా విషయానికి వస్తే రోజా కెరియర్ ని మొదలుపెట్టిన కొత్తలో సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో రోజా కి శ్రీకాంత్ అన్నయ్యగా నటించాడు.
తర్వాత అదే శ్రీకాంత్ హీరోగా ఎదిగిన తర్వాత అయనతో రోజా హీరోయిన్గా చేసింది. వీరి కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర సినిమాలో కూడా రోజా శ్రీకాంత్ మొగుడు పెళ్ళాలు గా నటించారు . ఇక శ్రీకాంత్ కి చెల్లిగా నటించిన రోజా మళ్ళీ శ్రీకాంత్ తోనే రొమాన్స్ చేసింది. శ్రీకాంత్ ని రోజా సెట్స్ లో అన్నయ్య అని పిలిచే వారట. చివరి కి రొమాంటిక్ సీన్స్ లో కూడా అన్నయ్య అంటూ శ్రీకాంత్ పక్కన యాక్ట్ చేసేదట దీంతో శ్రీకాంత్ చాలా ఇబ్బంది పడే వారట. ఒకసారి ఈ విషయం పై శ్రీకాంత్ కోప్పడ్డారు కూడా. అలా శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.