మన పాత తరం స్టార్ హీరోలలో శోభన్ బాబు కూడా ఒకరు.  ఆయన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.. సాధారణంగా ఎన్నో సినిమాల్లో హీరోగా  చేసిన న‌టుల‌కు కూడా కొన్ని కొన్ని సార్లు అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. కొంత వయసు వచ్చిన తర్వాత అవకాశాలు కూడా రావు. ప్రేక్షకులు కూడా వాళ్ళని స్క్రీన్ మీద చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు. హీరోలకు అవకాశాలు రాక కొన్ని ప్రత్యేక పాత్రలు లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉంటారు. ప్రస్తుతం చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఒకప్పటి హీరోలే చేస్తున్నారు. తమ ప్రాధాన్యతను పక్కన పెట్టేసి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ తమ కెరీర్ను ముందుకు తీసుకువెళ్తున్నారు.


అయితే నటభూషణ శోభన్ బాబు మాత్రం తన కెరీర్ లో ఎప్పుడూ అలా చేయలేదు.. హీరోగా వందల సినిమాలో నటించారు తర్వాత వచ్చిన ఎన్నో అద్భుతమైన అవకాశాలను చేతులారా వదులుకున్నారు శోభన్ బాబు.. అలా వదులుకున్న పాత్రలు ఏంటో  ఇక్కడ చూద్దాం.  నాగార్జున కె రాఘవేంద్రరావు   దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు.. ఈ సినిమాలు వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం ముందుగా శోభన్ బాబును అడిగారట. ఆయన ఒప్పుకోలేదు.. అలాగే పవన్ కళ్యాణ్  సుస్వాగతం సినిమాలో హీరో తండ్రిగా నటించిన రఘువరన్ కి ఎంతో మంచి పేరు వచ్చింది ముందుగా ఆ క్యారెక్టర్ కోసం శోభన్ బాబుని సంప్రదించారట. కానీ శోభన్ బాబు ఆ పాత్ర చేయడానికి కూడా ఒప్పుకోలేదట.


అతడు మూవీలో నాజర్ పోషించిన పాత్ర కోసం కూడా శోభన్ బాబుని ముందు అడిగారు.. కానీ ఆ పాత్రను కూడా శోభన్ బాబు మిస్ చేసుకున్నారు. అన్నమయ్య , సుస్వాగతం సినిమాల్లో నటించడానికి శోభన్ బాబు ఒప్పుకోకపోవడంతో నిర్మాత మురళీమోహన్ శోభన్ బాబుకి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి పాత్ర పోషించమని అన్నారట . కానీ శోభన్ బాబు ఒప్పుకోలేదు . హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన బ్లాక్ చిత్రం అక్కడ సూప‌ర్ హిట్ అయింది..  ఈ మూవీని తెలుగులో శోభన్ బాబుతో రీమేక్ చేయాలనుకున్నారు . అది కూడా కుద‌ర‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: