పైన కనిపిస్తున్న హీరోయిన్ పేరు వాణి విశ్వనాథ్.. ఈమెకు సెక్సీ క్వీన్ అని పేరుతెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ. కుటుంబ నేపథ్యం మలయాళం అయినా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలాంటి హీరోయిన్ దర్శకేందుద్రుడు చేతిలో పడితే తెరపై ఎంత అద్భుతంగా చూపిస్తారో ప్రతేకంగా చెప్పనవసరం లేదు. అలాగే 1982లో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సామ్రాట్ అశోక సినిమాలో వాణి విశ్వనాథ్ హీరోయిన్గా నటించింది. అప్పటికి ఈమె వయసు 15 సంవత్సరాలు మాత్రమే .. 15 ఏళ్ల వయసులో నే 60 ఏళ్ల వయసున్న ఎన్టీఆర్ కు జంటగా ఎంతో అద్భుతంగా నటించింది వాణి ..


సినిమా షూటింగ్ అయ్యాక రెమ్యూనిరేషన్ తో పాటు వాణికి అదనంగా 50 వేల రూపాయలు ఎన్టీఆర్ ఇచ్చి పంపారట . అంతా ఓకే అనుకుంటున్న సమయం లో ఒక్కసారిగా అప్పటి వార్తా పత్రికల్లో ఎన్టీఆర్ వాణి విశ్వనాథ్‌ని పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్త‌లు కూడా వచ్చాయి. ఎన్టీఆర్ అప్పటి కే ఒంటరిగా ఉండటం ఈ సినిమా లో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయే రీతిలో ఉండటం వాణి విశ్వనాథ్ అందం ఈ రూమర్ల ను బలపరిచే లా చేశాయి . చిత్ర పరిశ్రమ లో కూడా అప్పట్లో ఈ వార్త‌లు సంచలనం సృష్టించాయి .


ఈ వార్తలు వెనక అప్పటి ప్రభుత్వ పెద్ద‌త హస్తం ఉందని కూడా అంటారు . త‌న జీవిత చ‌రిత్ర‌ను రాస్తున్న ల‌క్ష్మీపార్వ‌తి ని 1993లో వివాహం చేసుకున్నాక ఈ పుకార్ల‌కు పుల్ స్టాప్ ప‌డ్డాయి . కేర‌ళకు చెందిన వాణి విశ్వ‌నాథ్ 4 సంవ‌త్స‌రాల్లో 15 కు పైగా వాన పాట‌ల్లో న‌టించి ది గ్లామ‌ర్ యాక్ట్రెస్ గా మంచి పేరు సంపాదించారు .  అంతేకాదు, ఇలాంటి వాన పాటల్లో నటించడం తనకి చాలా ఇష్టమని స్వయంగా వాణీ విశ్వ‌నాథ్‌ చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఈ రకంగా వాణీ విశ్వ‌నాథ్‌కు సెక్సీ హీరోయిన్, గ్లామర్ క్వీన్ అనే పదాలు అభిమానులు తగిలించారంటే దానికి కారణం రాఘవేంద్ర రావే అని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: