టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయన తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే ఈయన కెరియర్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ఆయన సినిమాలలో మనసంతా నువ్వే సినిమా ఒకటి. ఈ మూవీ లో రీమాసేన్ హీరోయిన్గా నటించగా వి ఎన్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం ఎస్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2001 వ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి అక్టోబర్ 19 వ తేదీతో 23 సంవత్సరాలు పూర్తి అయింది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి 23 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో ఈ మూవీ కి జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ , ఈ మూవీ వసూలు చేసిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకి నైజాం ఏరియాలో 6.42 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.10 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.58 కోట్లు , ఈస్ట్ లో 1.21 కోట్లు , వెస్ట్ లో 1.08 కోట్లు , గుంటూరులో 1.38 కోట్లు , కృష్ణ లో 1.44 కోట్లు , నెల్లూరులో 88 లక్షల కలెక్షన్లు దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 17.09 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లేస్ ఓవర్సీస్ లో 1.22 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 18.31 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగిన ఈ సినిమా ఫుల్ రన్ లో 18.31 కోట్ల షేర్ కలెక్షన్లను అందుకొని భారీ లాభాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: