మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి సినిమా ద్వారా తెలుగు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో దుల్కర్ పాత్ర అద్భుతమైన స్థాయిలో ఉండడంతో ఈ మూవీ ద్వారా దుల్కర్ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో సీత రామం అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా ... హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో దుల్కర్ క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే ఈ సినిమాను కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ వారు నిర్మించారు. వైజయంతి బ్యానర్ వారు నిర్మించిన రెండు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించి రెండింటితో మంచి విజయాలను అందుకున్న ఈ నటుడు తాజాగా తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోగా ల్ నటించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ... వెంకీ అట్లూరిమూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ ని సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇప్పటివరకు తెలుగులో ఈయన నటించిన మూడు సినిమాలలో రెండు సినిమాలు కూడా వైజయంతి వారు నిర్మించారు. ఆ సినిమాలు విడుదల అయ్యి అద్భుతమైన విజయాలు కూడా అందుకున్నాయి. మొట్ట మొదటి సారి ఈ నటుడు బ్యానర్ మారి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సినిమా చేశాడు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: