ప్రజెంట్ ఎన్టీఆర్ ముంబైలో ఉన్నాడు . వార్ 2 షెడ్యూల్లో పాల్గొనడానికి వెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్ . కాగ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా మంచివాడు . ఆ విషయం అందరికి తెలిసిందే . అయితే ఆయన ఫ్రెండ్షిప్ కి కూడా ఎక్కువగా వాల్యూ ఇస్తూ ఉంటారు . ఎంతలా అంటే ఆయన పేరు చెప్పుకొని ఆయన క్లోజ్ ఫ్రెండ్ జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు.
అయినా ఆయన ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్ మీద కోప్పడకుండా.. ఆయనను దూరం పెట్టి ఆ డబ్బులను ఆ జనాలకి ఇచ్చేలా ఎన్టీఆర్ చూసుకున్నాడు . అంతేకాదు ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసే గుణం ఉంది అని తెలిసినా వాళ్ళని ఏనాడు కూడా శిక్షించడు. జూనియర్ ఎన్టీఆర్ తన పని తాను చూసుకోపోతూ ఉంటాడు. అలాంటి వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు. సీనియర్ ఎన్టీ రామారావు గారు కూడా అంతే గతంలో ఆయనను ఎంతో మంది పక్కనే ఉంటూ ముంచేసిన సందర్భాల్లో ఉన్నాయి . అయితే వారిని దూరం పెట్టాడే కానీ వాళ్ళు ఇలా నన్ను మోసం చేశారు అంటూ ఎప్పుడూ బయట పెట్టలేదు . అంతేకాదు ఎవరిని నోరు జారి ఒక మాట కూడా అనలేదు. అప్పుడు తాతకున్న గుణమే ఇప్పుడు మనవడికి కూడా వచ్చింది అంటూ నందమూరి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు .!