కాగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఏ విషయంలోనూ ఎవరికి అన్యాయం చేయలేదు. తనకు చేతనైతే నాలుగు రూపాయలు సహాయం చేశాడు కానీ ఎవరిని తన మాటలతో చీట్ చేయలేదు . అయితే తనను హర్ట్ చేసిన వాళ్ళను నవ్వుతూనే సరదాగా స్టేజ్ పైన ఇచ్చి పడేసిన సందర్భాలు ఉన్నాయి . అలాంటి నాగేశ్వరరావు గారు ఒక వ్యక్తికి క్షమాపణలు చెప్పాడు . అది కూడా ఆయన ఆఖరి రోజుల్లో. ఆమె మరెవరో కాదు అక్కినేని అమల .
ఎస్ అక్కినేని అమలకి ఆఖరి రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు క్షమించు అమ్మ అంటూ చాలా చాలా బాధపడ్డారట . దానికి కారణం అక్కినేని ఇంటికి కోడలుగా అమలను తీసుకురావాలి అనుకున్న నాగార్జున ..నాగేశ్వర రావు కి చెప్పిన మూమెంట్లో ఆయన మాట తూలడమే . అంతేకాదు లక్స్మి కి విడాకులు ఇచ్చాడు అన్న కోపం తో అక్కినేని అమలపై కూడా పలు సందర్భాలలో కోపంగా బిహేవ్ చేశారట .
అయితే అమల మాత్రం ఎప్పుడూ అక్కినేని నాగేశ్వరరావు గారిని మామగారులా కాకుండా సొంత నాన్నలాగే చూసిందట . ఆయనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు పక్కనే ఉండి ఆయన బాగోగులు కూడా చూసుకుందట . ఆయన ఆఖరి నిమిషంలో నేను నీ విషయంలో తప్పు చేశాను తల్లి .. నన్ను క్షమించు అంటూ క్షమాపణలు కూడా చెప్పారట . అప్పట్లో ఈ న్యూస్ విని అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. అంత మంచి మనసు అక్కినేని అమలది అంటూ ప్రశంసిస్తున్నారు..!!