యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. తాజాగా తారక్ "దేవర పార్ట్ 1" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా ... హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , అజయ్ ముఖ్య పాత్రలలో నటించారు.

సెప్టెంబర్ 27 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే భారీ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కన్నడ గడ్డపై అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ఇప్పటికే వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాకు కన్నడ భాషకు సంబంధించి 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ ఇప్పటివరకు కన్నడ ఏరియాలో ఏకంగా 18 కోట్ల షేర్ ... 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

కన్నడ ఏరియాలో 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు జరగగా ఇప్పటికే 18 కోట్ల షేర్ కలెక్షన్లను ఈ ప్రాంతంలో వసూలు చేసే 2 కోట్ల లాభాలను దేవర ఈ ఏరియాలో రాబట్టింది. ఇలా కన్నడ ఏరియాలో దేవర సినిమా అద్భుతమైన కలెక్షన్లను ఇప్పటికే రాబట్టింది. ఇప్పటికి కూడా ఈ సినిమా ఈ ఏరియాలో మంచి హోల్డ్ ను కనబరిస్తూ డీసెంట్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. మరి ఫైనల్ రన్ లో కన్నడ ఏరియాలో ఈ సినిమా ఎన్ని కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: