మన తెలుగు హీరోలలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఈయన రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ మూవీలలో హీరోగా నటించి అద్భుతమైన విజయాలను అందుకోవడంతో ఈయన క్రేజ్ ఇండియా వ్యాప్తంగా అమాంతం పెరిగింది. ఆ తర్వాత కూడా ఈయన పాన్ ఇండియా సినిమాల్లో హీరోగా నటిస్తూ రావడం , ఆయన నటించిన సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో ఆయన క్రేజ్ చాలా వరకు పెరిగింది. దానితో ఇప్పుడు ప్రభాస్ నటించిన ఏ సినిమా విడుదల అయినా దానికి ఎలాంటి టాక్ వచ్చిన వందల కోట్లలో కలెక్షన్లు వస్తున్నాయి.

ఇకపోతే యంగ్ టైగర్ జూనియర్ , ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈయనకి మరింత క్రేజ్ పెరిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "వార్ 2" అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే హిందీ ఏరియాలో తారక్ క్రేజ్ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా జూనియర్ ఎన్టీఆర్సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు.

మూవీ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించినట్లు అయితే తారక్ క్రేజ్ కూడా ఇండియా వ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే ప్రభాస్ ఇండియా వ్యాప్తంగా తన క్రేజ్ ను చాలా వరకు పెంచుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా రాబోయే ఒకటి , రెండు సినిమాలతో మంచి విజయాలను అందుకుంటే ఈయన క్రేజ్ కూడా ఇండియా వ్యాప్తంగా బలంగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: