టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిన తర్వాత కొంత మంది బాలీవుడ్ సినిమాలలో నటించాలి అనే ఇష్టంతో బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అవకాశాలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ఇలియానా ఒకరు. ఈ ముద్దు గుమ్మ రామ్ పోతినేని హీరో గా వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ తెలుగు లో వచ్చింది.

ఆ తర్వాత ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలం లోనే ఇలియానా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. అలా తెలుగు లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ హిందీ సినీ పరిశ్రమపై ఆసక్తిని చూపించింది. అందులో భాగంగా హిందీ సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమెకు తెలుగు లో వచ్చినంత స్థాయి విజయాలు హిందీ లో దక్కలేదు.

దానితో ఆమెకు కెరియర్ ప్రారంభంలో కొన్ని హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చిన ఆ తర్వాత క్రమంగా అవకాశాలు తగ్గాయి. ఇక ఇప్పుడు ఇటు తెలుగు లోనూ , అటు హిందీ లోనూ పెద్దగా అవకాశాలు లేవు. ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే హిందీ సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని చూపించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ కి కూడా హిందీ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు పెద్దగా దక్కడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: