బుల్లితెర మీద మేల్ ఫిమేల్ యాంకర్స్ మధ్య పోటీ తెలిసిందే. సినిమా ఈవెంట్స్ వరకు సుమా ఏక చత్రాధిపత్యం అన్నట్టుగా ఆమె ఫాం కొనసాగిస్తుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సుమ చేయాల్సిందే అనేలా చేస్తుంది. ఒకటి రెండు మిస్సైనా మాక్సిమం ఆమె కవర్ చేస్తుంది. ఇక టీవె షోస్ లో యాంకర్స్ గా మేల్ డామినేషన్ చేద్దామని చూసినా అది కుదరలేదు. ఐతే ప్రదీప్ మాత్రం దానిలో ప్రత్యేకంగా నిలిచాడు. యాంకర్ ప్రదీప్ ఏ షో హ్యాండిల్ చేసినా అది సూపర్ హిట్ అన్నట్టే లెక్క.

అదేంటో అతను చేసిన షోస్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకునేవి. ఢీ ఇన్ని సీజన్లు హోస్ట్ చేసిన ప్రదీప్ గత సీజన్ నుంచి దూరంగా ఉంటున్నాడు. అదే కాదు మరెక్కడ టీవీల్లో కనిపించట్లేదు. ప్రదీప్ కి ఏమైంది ఎందుకు అతను షోలు చేయట్లేదు అంటే సడెన్ గా మరో సినిమాతో సర్ ప్రైజ్ చేశాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ తో ప్రదీప్ సినిమా చేస్తున్నాడు.

ఈ టైటిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా మరి సెంటిమెంటో లేదా సినిమా కథకు యాప్ట్ అని పెట్టారో కానీ క్యాచీ టైటిల్ తో ప్రదీప్ అదరగొట్టాడు. ఇక ఇందులో హీరోయిన్ గా మరో యాంకర్ దీపిక పిల్లిని తీసుకున్నారు. దీపిక కూడా ఢీ షోని చేసింది ఆ తర్వాత స్టార్ మా లో అదిరింది హోస్ట్ చేసింది. ఈమధ్య ఆహా లో కనిపించింది. వాంటెడ్ పండుగాడ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దీపిక ప్రదీప్ తో జత కడుతూ ఈ సినిమా చేస్తుంది. ఈ ఇద్దరు ఒక ప్లాన్ ప్రకారమే బుల్లితెరని వీడి వెండితెర మీద మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యారు. మరి వీరి కలయికతో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: