మాలీవుడ్ ,టాలీవుడ్  ఇండస్ట్రీలో విభిన్నమైన చిత్రాలతో పాత్రలతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మహానటి సినిమా ద్వారా దగ్గరైన దుల్కర్ సల్మాన్ ఆ తర్వాత సీతారామం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక అప్పటినుంచి తన చిత్రాలను తెలుగులో కూడా డబ్బింగ్ చేస్తూ విడుదల చేస్తే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే సినిమాలో నటించారు ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు తీసుకున్నారు.



ట్రైలర్ ని కూడా ఈరోజు కొన్ని గంటల క్రితం విడుదల చేయగా.. ఇందులో దుల్కర్ నటన అద్భుతంగా ఉన్నట్టు కనిపిస్తోంది.. సాధారణ మనిషి యొక్క జీవితం అసాధారణ ప్రయాణంగా మారడాన్ని లక్కీ భాస్కర్ చిత్రంగా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అలాగే ఇందులో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా అద్భుతంగా నటించినట్లు కనిపిస్తోంది. ఎప్పుడు కూడా విభిన్నమైన పాత్రలనే ఎంచుకొని దుల్కర్ సల్మాన్ ఈసారి కూడా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు  ఈ సినిమా మొత్తం కుటుంబ ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తోంది. అలాగే ప్రస్తుతం సమాజంలో జరిగే ఎటువంటి కొన్ని విషయాలను కూడా ఇందులో కళ్లకు కట్టినట్టుగా చూపించారు.



సామాన్య వ్యక్తి డబ్బు కోసం ఎంత రిస్క్ అయినా చేసే పాత్రలో దుల్కర్ సల్మా కనిపించారు. డబ్బే ప్రపంచాన్ని శాసిస్తోందనే విధంగా ఇందులోని పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించారు. దుల్కర్ సల్మాన్ ఫేసులో దురాశ, ప్రేమ, అహంకారం, విశ్వాసం ఇలా ప్రతి ముఖ కవళికలు చాలా  చక్కగా చూపించారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న లక్కీ భాస్కర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో రిలీజ్ చేయబోతున్నారట. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో చెప్పిన డైలాగులు కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: