జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా అంటే అసలకే నో చెప్పడానికి నోరు కూడా రాదు. వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమాని ప్లాన్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. " అరవింద సమేత వీర రాఘవ".. మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చాలా టైం గ్యాప్ తీసుకొని ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కనిపించాడు. ఈ సినిమా బిగ్ హిట్ అయింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ మరొక సినిమాను అనుకున్నాడు . ఆ సినిమాలో చిరంజీవిని కూడా ఒక లీడ్ క్యారెక్టర్ లో చూపించాలి అని ఆశపడ్డారు. అటువంటి ఒక స్పెషల్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీని రెడీ చేసుకున్నారు.
అయితే ఈ స్టోరీ చిరంజీవికి జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పగా నో అంటూ ఫస్ట్ లైన్లోనే తెగేసి చెప్పేసారట . "ఇటువంటి స్టోరీస్ తెలుగు జనాలకు పెద్దగా నచ్చవు అలాంటి సినిమాలు తెరకెక్కిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది . అది కూడా పెద్ద స్టార్స్ తోనా ..? అస్సలు కుదరదు" అంటూ చిరంజీవి అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు రిజెక్ట్ చేశారట . అయితే కొరటాల శివ ఓన్ టాలెంట్ తో అదే కధను అటు ఇటుగా మార్చి ఆ తర్వాత చిరంజీవి - రామ్ చరణ్ తో ఆచార్య సినిమాను తెరకెక్కించారట .
ఆ సినిమా ఎంత ఫ్లాప్ అయిందో మనకు తెలిసిందే. అయితే కొంతమంది చిరంజీవి .. కొరటాల డైరెక్షన్లో వేలు పెట్టాడు అని.. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయిందని అంటుంటే మరి కొంతమంది మాత్రం అది కొరటాల ఓన్ టాలెంట్ అని ...అందులో ఎవరు వేలు పెట్టాల్సిన అవసరం లేదు అని ట్రోల్ చేశారు . మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ బిగ్ డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడు . ఒకవేళ ఆ ప్రాజెక్టును ఓకే చేసి ఉంటే కెరియర్ నిజంగా ఢమాల్ అంటూ పడిపోయేది..!!