- సావిత్రి, సౌందర్య తర్వాత టాలీవుడ్ లో స్నేహ..
- సాంప్రదాయమైన పాత్రల్లో అదరగొట్టే బ్యూటీ..
- అందం తో ఎంతో మందిని ఆకర్షించిన స్నేహ..

స్నేహ.. తెలుగు తనం ఉట్టిపడేలా తన అందం తోనే ఎంతోమంది ఆకర్షించిన స్నేహ సాంప్రదాయమైన పాత్రల కు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో చాలా సాంప్రదాయం గా నటించింది. అలా స్నేహ సినిమా లో ఉంది అంటే చాలు ఎంతో మంది ప్రేక్షకులు సినిమా ను చూడడానికి ఇష్టపడేవారు. మరి అలాంటి స్నేహ సినిమాల తో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

 తొలి వలపు మూవీ ద్వారా తెలుగు చిత్ర సీమ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత తరుణ్ తో ప్రియమైన నీకు మూవీ లో సంధ్య పాత్ర లో నటించి అదర గొట్టేసింది. ఈ మూవీ లో తన అమాయకమైన లుక్స్ కి ఎంతో మంది ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత వచ్చిన శ్రీరామదాసు లో గోపన్న భార్య గా స్నేహ అదరగొట్టేసింది. అలాగే సంక్రాంతి మూవీ లో వెంకటేష్ భార్య గా ఒక పద్ధతి గల కోడలి గా తెలుగు వారిని ఆకర్షించింది. అలా స్నేహ హీరోయిన్ గా చేసిన వెంకీ, హనుమాన్ జంక్షన్, మహారథి, మధు మాసం, మనసు పలికే మౌన గీతం, ఏవండోయ్ శ్రీవారు, రాధా గోపాలం, పాండురంగడు ఇలా ఎన్నో సినిమాల్లో చీర కట్టు లో కనిపించి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యం గా ఈ హీరోయిన్ నటి సావిత్రి, సౌందర్య తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు ను సంపాదించుకుంది.ఇక స్నేహ అవకాశాలు తగ్గక కూడా సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.అయితే స్నేహ ఉన్న పర్సనాలిటీ కి సాంప్రదాయమైన పాత్ర లే బాగా సెట్ అవుతాయి. అందుకే ఈమె కు ఇండస్ట్రీ లో చాలా క్రేజ్ ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: