సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో చాలా మంది తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే వారే ఉన్నారు. కొంత మంది మాత్రం సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన స్కిన్ షో కి కాస్త దూరంగా ఉంటూ నటనతోనే ఎక్కువ శాతం ప్రేక్షకులను ఆకట్టుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో జెనీలియా ఒకరు. ఈ ముద్దుగుమ్మ తెలుగు , తమిళ్ భాషలో అనేక సినిమాలలో నటించింది. అలాగే హిందీ భాషలలో కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాలలో నటించింది.

ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించిన ఏవో ఒకటి రెండు సినిమాల్లో కాస్త అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎక్కువ శాతం మాత్రం ఈమె తన నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. దానితో ఈమెకు తెలుగు , తమిళ , హిందీ పరిశ్రమలలో నటిగా ఒక మంచి గుర్తింపు ఏర్పడింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈమె మీడియం రేంజ్ హీరోలతో , స్టార్ హీరోలతో కూడా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈమె తెలుగులో బొమ్మరిల్లు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ ద్వారా ఈమెకు అదిరిపోయే రేంజ్ గుర్తింపు లభించింది. ఈమె తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ సరసన కూడా నటించింది. కానీ వీరిద్దరితో నటించిన సినిమాలు కూడా జెనీలియా కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ఇక ఈ ముద్దుగుమ్మ సిద్ధార్థ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ అనే తమిళ సినిమాలో నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ మధ్య కాలంలో ఈమె పెద్ద స్థాయిలో సినిమాల్లో నటించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: