తెలుగమ్మాయి అంజలి హీరోయిన్ గా తమిళంలో మంచి గుర్తింపే సంపాదించుకుంది. తెలుగులో కూడా ఆమె కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో సీతగా, మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి. అమాయకంగా కనిపిస్తూనే, కల్లాకపటం ఎరుగని, చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు అందరూ చప్పట్లుకొట్టారు.ఈ నేపథ్యంలో తను తెలుగులో చేసిన ఏ పాత్రను కోలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు అని అడగగా.. కొంచెం కూడా ఆలోచించకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని సీత పాత్ర అని చెప్పేసింది అంజలి. ఆ క్యారెక్టర్, ఆ సినిమా.. తమిళంలో కూడా చాలా ఫేమస్ అని తెలిపింది. అంతే కాకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు సంబంధించిన మరికొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ‘‘అంత పెద్ద సినిమాలో నాకు అవకాశం రావడం చాలా సంతోషం. అది నా లాంచ్ లాంటిదే. జర్నీ తర్వాత నేరుగా నా మొదటి తెలుగు మూవీ అది. ఎటు తిరిగి చూసినా అందులో పెద్ద యాక్టర్లే’’ అంటూ చెప్పుకొచ్చింది అంజలి సీత అనే క్యారెక్టర్ డిజైన్ చేయడమే ఒక మ్యాజిక్ పేపర్ మీద ఆ క్యారెక్టర్‌ను ఎలా రాశారో అంతకంటే బాగా సినిమా రావడం అనేది మరింత స్పెషల్‌గా మారిపోయింది. అది ఎప్పటికీ నా మనసులో నిలిచిపోతుంది’’ అంటూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని సీత క్యారెక్టర్ తనకు ఎంత స్పెషల్ అని చెప్పింది.సినిమా పూర్తయిపోయిన తర్వాత ఏదైనా క్యారెక్టర్ తనకు బలంగా గుర్తుండిపోయిందా అని అడగగా.. ముందుగా సీత అనే చెప్పింది అంజలి.