కాటుక కళ్లతో కవ్వించే అందం కాజల్ సొంతం
 
తన క్యూట్ స్మైల్ కి పడిపోని ప్రేక్షకుడు ఉండడు
 
 కళ్ళతో మాయ చేయాలంటే కాజల్ తరువాతే ఎవరైనా


టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అందం, అభినయంతో టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.. పెళ్లి కాకముందు కూడా కాజల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా  ఓ వెలుగు వెలిగింది.. కాజల్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసింది.. ఆ పాత్రలు ఆమెకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తీసుకోని వచ్చాయి.. అయితే ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ అందరూ గ్లామర్ రోల్స్ ఎక్కువ చేస్తున్నారు.. యాక్టింగ్ స్కోప్ పాత్రలు రావడం చాలా కష్టంగా మారింది.. అయితే కాజల్ కూడా గ్లామర్ పాత్రలు చేసింది.. కానీ ఆమెకంటూ గుర్తింపు తెచ్చిన సినిమాలు కొన్ని వున్నాయి.. వాటిలో ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ ఒకటి..ఆ సినిమాలో కాజల్ నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.. ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిలాగా కాజల్ లుక్స్ కూడా చాలా క్యూట్ గా ఉంటాయి..మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ అద్భుత విజయం సాధించడానికి కాజల్ కూడా ఒక కారణం అని చెప్పాలి..అయితే కాజల్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ ‘డార్లింగ్’ ఈ సినిమాలో వీరిద్దరి పెయిర్ ఎంతో అద్భుతంగా వర్క్ అవుట్ అయింది.. కాజల్ కి యూత్ లో మంచి తీసుకొచ్చిన సినిమా కూడా డార్లింగే కావడం విశేషం.. ప్రస్తుతం కాజల్ తన కొడుకు నీల్ బాధ్యత చూసుకుంటూ వరుస సినిమాలు ఒప్పుకుంటుంది.. పెళ్లి తరువాత కాజల్ నటించిన భగవంత్ కేసరి అద్భుత విజయం సాధించింది.. ఆ తరువాత వచ్చిన భారతీయుడు 2 లో కాజల్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు..ఇండియన్ 3 లో కాజల్  ఫుల్ లెంగ్త్ పాత్రలో నటిస్తుంది.. త్వరలోనే ఆ సినిమా ఓటిటిలోకి రానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: