సీనియర్ హీరోయిన్ సంఘవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు సినిమాల ద్వారానే కెరియర్ను మొదలు పెట్టింది. 1993 వ సంవత్సరం కొక్కరోకో అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీ తమిళ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా అజిత్ హీరోగా ఓ మూవీ చేసింది. ఈ సినిమా అజిత్ కి కూడా మొట్ట మొదటి సినిమానే. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత విజయ్ తో ఓ సినిమా చేసింది. ఆ మూవీ కూడా సక్సెస్ కావడంతో ఈమెకు తమిళ్ లో తిరుగు లేకుండా పోయింది. 

ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ కన్నడ , మలయాళ సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి విజయాలను అందుకుంది. ఇలా తెలుగు లో కెరియర్ ను మొదలు పెట్టిన తమిళ్ , కన్నడ , మలయాళ ఇండస్ట్రీ లలో ఈ బ్యూటీ మొదటగా విజయాలను అందుకుంది. ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత మళ్లీ తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ఈమె తాజ్ మహల్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు కూడా ఈమె నటించినవి తెలుగు లో మంచి విజయాలు అందుకున్నాయి. 

ఈమెకు తెలుగు లో మంచి గుర్తింపును తీసుకు వచ్చిన సినిమాలలో కృష్ణ వంశీ దర్శకత్వంలో సింధూరం , వెంకటేష్ హీరోగా రూపొందిన సూర్యవంశం సినిమాలు ముందు వరసలో ఉంటాయి. ఈ సినిమాల ద్వారా ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ 2016 వ సంవత్సరం వెంకటేషన్ అనే బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్ కొనసాగించిన ఈ ముద్దు గుమ్మ ఆ సమయంలో తన నటనతో , అందాలతో రెండింటితో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: