ఏపీలో జీఎస్టీతో కలిపి దేవర సినిమా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం అందుతోంది. దేవరకు సొంతమైన ఈ రికార్డ్ నందమూరి అభిమానులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు. టైగర్ పవర్ కు ఫ్రూఫ్ ఇదే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. దేవర కలెక్షన్లు యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని అయితే కలిగిస్తున్నాయి. ఈ సినిమా న భూతో న భవిష్యత్ అనేలా రికార్డులు క్రియేట్ చేస్తోంది.
దేవర సినిమా బిజినెస్, కలెక్షన్ల విషయంలో నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది. దేవర సినిమా ఏపీలో నాన్ రాజమౌళి రికార్డ్ క్రియేట్ చేయడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. దేవర సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని భారీ, క్రేజీ రికార్డులను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.
దేవర1 సినిమా సరికొత్త రికార్డులను అందుకోవాలని ఎన్టీఆర్ ఖాతాలో మైండ్ బ్లాంక్ అయ్యే రికార్డులు చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమాతో బిజీగా ఉన్నారు. వార్2 సినిమాలో తారక్ అదిరిపోయే ఛేజింగ్ సీక్వెన్స్ లలో కనిపించనున్నారని తారక్ డ్యాన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని సమాచారం అందుతోంది. తారక్ పొలిటికల్ వివాదాలకు దూరంగా ఉంటూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు.