అక్కినేని అఖిల్ నటించిన హలో మూవీ అందరూ చూసే ఉంటారు.. ఈ సినిమాలో అఖిల్ సరసన కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాతో పాటు మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ హీరోగా చేసిన చిత్రలహరి మూవీ లో కూడా కళ్యాణి ప్రియదర్శి హీరయిన్ గా చేసింది.అయితే తెలుగులో అంతగా అవకాశాలు రాకపోయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టేంత స్థాయికి మాత్రం ఎదిగింది.అలా తెలుగు,తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే తెలుగులో ఈ హీరోయిన్ ని పక్కన పెట్టినప్పటికీ తమిళ ప్రేక్షకులు మాత్రం ఆదరిస్తున్నారు. అయితే ఓవైపు అవకాశాలు వస్తున్న వేళ తాజాగా ఈ బ్యూటీ పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. 

అంతే కాదు పెళ్లికి సంబంధించిన వీడియోస్ షేర్ చేయడంతో చాలామంది ఈ వీడియో చూసిన జనాలు ఏంటి పెళ్లయిన ఈ సీరియల్ నటుడిని కళ్యాణి ప్రియదర్శి మళ్లీ పెళ్లి చేసుకుంది అంటూ షాక్ అవుతున్నారు. అయితే కళ్యాణి ప్రియదర్శి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు కోలీవుడ్ బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఫేమస్ అయినటువంటి శ్రీరామ్.. కళ్యాణి ప్రియదర్శి శ్రీరామ్ ఇద్దరు పెళ్లి చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారడమే కాదు  శ్రీరామ్ ఈ వీడియో కింద "ఈ క్షణాలు మమ్మల్ని ఎంతో సంతోష పరుస్తాయి" అంటూ క్యాప్షన్ పెట్టడంతో ఈ జంట నిజంగానే పెళ్లి చేసుకున్నారు అని అందరూ షాక్ అయిపోతున్నారు. 

అయితే శ్రీరామ్ కి ఇప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఈ హీరోయిన్ ఏంటి ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈ వీడియో వైరలైన కొద్ది గంటలకే మళ్ళీ నటుడు శ్రీరామ్ క్లారిటీ ఇచ్చారు  కళ్యాణి ప్రియదర్శి, నేను పెళ్లి చేసుకుంటున్నట్టు వస్తున్న వీడియోలో ఎలాంటి నిజం లేదు. ఎందుకంటే అది కేవలం ఓ అడ్వర్టైజ్మెంట్ కోసం అలా నటించాల్సి వచ్చింది. మేము పెళ్లి చేసుకున్నామని అందరూ అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు అంటూ షాకిచ్చారు శ్రీరామ్.ఇక శ్రీరామ్ మాటలతో కళ్యాణి ప్రియదర్శి అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక శ్రీరామ్,కళ్యాణి ప్రియదర్శి కలిసి భారత్ వెడ్డింగ్ కలెక్షన్స్ అనే ఒక అడ్వర్టైజ్మెంట్ లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: