ఇక ముందుగా పూరి జగన్నాథ్ విషయానికొస్తే ఎన్టీఆర్ తో టెంపర్ తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోలేక పోతున్నాడు. వరుస సినిమాలు చేస్తున్న ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. అలాగే మరో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా రామ్ చరణ్‌తో ధ్రువ తర్వాత ఆ స్థాయి హిట్ ఇప్పటికి చూడలేదు. మధ్యలో అఖిల్ తో ఏజెంట్ సినిమాతో వచ్చి భారీ డిజాస్టర్ అందుకుని ఇప్పటికీ మరో సినిమా మొదలెట్ట లేకపోతున్నాడు. అలాగే వివి వినాయక్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో సినిమాలుకు దూరంగా ఉన్న ఈ దర్శకుడు చిరంజీవితో తీసిన ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ సినిమా చేయలేదు.
అలాగే సెన్సిటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా టాలీవుడ్ కి ఎన్నో గోప్ప సినిమాలు ఇచ్చాడు. ప్రస్తుతం ఒక హిట్ కోసం ఎన్ని సినిమాలు చేస్తున్న సక్సెస్ రావట్లేదు. అలాగే మరో స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఎన్టీఆర్ తో బాద్షా తర్వాత శ్రీనువైట్ల ఆ స్థాయి విజయం అందుకోలేదు. ఈ మధ్యలో అర డజనకు పైగా సినిమాలు వచ్చిన ఏది బాక్సాఫీస్ దగ్గర సరైన విజయ అందుకోలేదు. తాజాగా ఈ దసరాకి గోపీచంద్ తో విశ్వం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రజెంట్ ఈ దర్శకుల ఫామ్ చూసి స్టార్ హీరోలు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. పాత పరిచయంతో ఎవరైన ఇవ్వాలనుకున్నా... ఇప్పటికిప్పుడు డేట్స్ ఇచ్చేంత ఖాళీగా ఏ హీరో లేరు. మరి ఈ సిచ్యుయేషన్ నుంచి మన దర్శకులు బయటపడతారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ .