ఇప్పటికీ ఈనను దర్శకులు గురువుగా భావిస్తారు. మన పాత రోజుల్లోనే ఎన్నో విభిన్నమైన సినిమాలు తీసి తెలుగు ప్రేక్షకులను అబ్బురపరిచారు. 70- 80ల కాలంలోనే తన వినూత్న ఆలోచనతో ఇప్పుడు వచ్చే సినిమాలను అప్పట్లోనే తీశారు. అలా కె.వి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన గొప్ప సినిమాలలో మాయాబజార్ కూడా ఒకటి .. ఇప్పటికీ ఈ సినిమా కలక్ట్ క్లాసిక్ గా చెప్పుకుంటారు. ఎన్టీఆర్ , నాగేశ్వరరావు , ఎస్వీ రంగారావు , సావిత్రి వంటి అగ్ర నటులతో ఆయన తీసిన ఈ గొప్ప కళాకాండం తెలుగు చిత్ర పరిశ్రమలోనే తొలి పాన్ ఇండియా సినిమా అని అంటారు.
మహాభారతంలోని అభిమన్యుడు - శశిరేఖ వివాహ ఘట్టాన్ని మూల కథగా తీసుకుని మాయాబజార్ సినిమాని తెరకెక్కించారు . ఆ రోజుల్లో సాధారణంగా 30వేల బడ్జెట్ ను మించి సినిమాలు తీయడానికి నిర్మాతలు సాహసించేవారు కాదు. కానీ మాయాబజార్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయ ప్రొడక్షన్స్ ఖర్చుకు వెనకాడ లేదు. తెలుగు , తమిళ భాషలో ఒకేసారి తెర్కెక్కిన తొలి సినిమా కూడా ఇదే. ఈ సినిమాని రెండు లక్షల పైగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. అలాగే ఈ సినిమా విడుదల తర్వాతే ఎన్నో భాషల్లో డబ్బ్ చేయగా విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. అందుకే నాటికి నేటికైనా మరి ఎప్పటికైనా మాయాబజార్ అనేది మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఓ గోల్డెన్ మెమరీ.