ఇష్క్ సినిమా మంచి సక్సెస్ ఇచ్చింది ఆ సినిమా అనంతరం ఈ బ్యూటీ నితిన్ తో మరోసారి జతకట్టి గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో నటించింది. ఈ సినిమాతో మంచి స్పందన వచ్చింది. ఇక ఇటీవల జరిగిన 71 నేషనల్ అవార్డ్స్ లో ఉత్తమ నటిగా నిత్యామీనన్ పురస్కారాన్ని అందుకుంది. తాజాగా నిత్యా మీనన్ ఓ ఇంటర్వ్యూలో తన సినిమా ఎంపికల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
నాకు నేషనల్ అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదని పేర్కొన్నారు నిత్యా మీనన్. ప్రతి పాత్రకు గుర్తింపు రావాలని నేను కోరుకోలేదని తెలిపారు. ఎందుకంటే నేను ఎంచుకున్నటువంటి రంగం అలాంటిది. నేను పోషించిన పాత్ర నాకు సంతోషాన్ని ఇస్తే చాలని అనుకున్నానని చెప్పారు నిత్యా మీనన్. ఇప్పటివరకు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆయా పాత్రలను ఎంపిక చేసుకున్నాను. భారీ బడ్జెట్ తో తీసే మసాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా నేను నో చెప్పేస్తాను అన్నారు నిత్యా మీనన్.
అలాంటి పాత్రలంటే నాకు అసలు ఇష్టం ఉండదు. మంచి పాత్ర అయితే చిన్న సినిమాకైనా సరే నేను ఓకే చెప్పి నటిస్తాను. అది ఎప్పుడు ప్రారంభమవుతుందా అని మాత్రమే ఆసక్తిగా ఎదురు చూస్తాను. అందరూ వెళ్తున్న మార్గంలో నేను వెళ్ళను" అని చెప్పుకొచ్చింది నిత్యా మీనన్. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.