ఎవరి జీవితం ఎపుడు మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. లేటు వయస్సులో, అంటే సరిగ్గా ముసలి వయస్సులో గంగవ్వ సోషల్ మీడియా పుణ్యమాని సెలిబ్రిటీ అయిపోయింది. అలా అవుతానని బహుశా గంగవ్వ కూడా కలలో కూడా అనుకొని ఉండదు. కానీ ఆమెని అదృష్టం వరించిందో లేక అద్భుతమే జరిగిందో కానీ ఆమె ఎవరో ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. యూట్యూబ్ లో అడపా దడపా కనిపించిన ఆమె నేడు సినిమాలలో కూడా కనిపిస్తోంది అంటే అంతా సోషల్ మీడియా మహిమగానే చూడాలి. కట్ చేస్తే గంగవ్వ ఏకంగా బుల్లితెర బిగ్ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన సంగతి విదితమే.

తరువాత సరిగ్గా 2 వారాల క్రితం ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అక్కడికి వెళ్ళింది. గంగవ్వతో పాటు మాజీ కంటెస్టెంట్స్ రోహిణి, మెహబూబ్, అవినాష్, గౌతమ్, నయని పావని, టేస్టీ తేజ, హరితేజ వైల్డ్ కార్డ్ ద్వారా సీజన్ 8లో కంటెస్ట్ చేసారు. ఇక గంగవ్వ వయసులో పెద్దవారు.. పైగా ఆమె పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగింది కాబట్టి సీజన్ 4లో ఆమె ఎలిమినేట్ కాలేదు. అనారోగ్య కారణాలతో సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయింది. దాంతోనే బిగ్ బాస్ మేకర్స్ ఆమెకు మరోసారి అవకాశం ఇచ్చారు. వయస్సు పెద్దది కాబట్టి గంగవ్వకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆమె ఫిజికల్ టాస్క్ లలో పాల్గొనడం లేదు. కానీ దురదృష్టకరం... గత రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చిందట. ఇక అర్థరాత్రి గుండెపోటు రావడంతో తోటి కంటెస్టెంట్స్ చాలా కంగారు పడిపోయారు.

దాంతో, హుటాహుటిన డాక్టర్స్ టీమ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి, ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్... ఇది ఫ్రాంక్ అని కొంతమంది అంటున్నారు. బిగ్ బాస్ ఆదేశాల మేరకు గంగవ్వ హార్ట్ అటాక్ వచ్చినట్లు నటించి, తోటి కంటెస్టెంట్స్ ని నమ్మించాలి! అనేది ఒక టాస్క్ అట. ఈ టాస్క్ లో గంగవ్వ సక్సెస్ అయ్యిందని అంటున్నారు. అయితే ఇలాంటి టాస్క్ లు చాలా ప్రమాదకరం అంటూ కొంతమంది విశ్లేషకులు బిగ్ బాస్ నిర్వాహకులను విమర్శిస్తున్నారు. మరోవైపు గంగవ్వ కుటుంబ సభ్యులు ఇటువంటి సమయంలో ప్రభావితం అవుతారు కాబట్టి ఈ తరహా టాస్క్స్ కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఇవ్వకుండా ఉంటేనే మంచిది సూచిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: