అవును... వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, మీరు విన్నది నిజమే. కృష్ణంరాజు సినిమాని మక్కీకి మక్కీ కాపీ కొట్టి చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. ఆయా 2 చిత్రాల కథలు దాదాపుగా ఒకటే అని అతి కొద్దిమందికి తెలుసు. మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇద్దరూ మొగల్తూరు నుంచి ఇంపోర్ట్ చేయబడ్డ దిగ్గజ నటులే అని తెలిసిందే. చిరంజీవి కంటే కృష్ణంరాజు సీనియర్ అయినప్పటికీ ఇద్దరికీ కొన్ని కొన్ని విషయాలలో సారూప్యత ఉండదని మీకు తెలుసా? చిరంజీవి కెరీర్ ఆరంభంలో కృష్ణంరాజు ఎంతో ప్రోత్సహించారు. ఇద్దరు కలసి నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి. మనవూరి పాండవులు చిత్రంలో చిరంజీవి, కృష్ణంరాజు కలసి నటించిన సంగతి విదితమే.

ఈ క్రమంలో వీరిద్దరూ ఒకేలాంటి సినిమాలు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఆ సినిమా మరేదో కాదు, చిరంజీవి కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన 'ఘరానా మొగుడు'. ఘరానా మొగుడు చిత్రం 1992లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసినదే. చిరంజీవి - నగ్మా ఈ చిత్రంలో జంటగా నటించగా సూపర్ డూపర్ హిట్ అయింది. కాగా సరిగ్గా పదేళ్ల క్రితం... 1982లో కృష్ణం రాజు, జయప్రద జంటగా నటించిన సీతారాములు చిత్ర కథ కూడా ఘరానామొగుడు తరహాలోనే ఉంటుంది. ఇదే కథని ఘరానామొగుడులో చిన్న చిన్న మార్పులు చేసి రూపొందించారా? అనే సందేహం అప్పట్లో కలిగింది కూడా!

అయితే అప్పట్లో ఘరానామొగుడు చిత్ర కథని రజనీకాంత్ మన్నన్ చిత్ర కథ నుంచి తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ కథకి మార్పులు చేసి రీమేక్ చేయాలని రాఘవేంద్ర రావు అనుకొని పరుచూరి బ్రదర్స్ కి చెప్పడంతో కథ విన్న బ్రదర్స్ ఇది కృష్ణంరాజు సీతారాములు కథలా ఉందే అని అన్నారట. వెంటనే కథలో మార్పులు చేసి చిరంజీవి మ్యానరిజమ్స్ యాడ్ చేసి అదిరిపోయేలా కాదని రాశారట. ఇక ఈ రెండు సినిమాలకి కధ పరంగా పోలికలను ఒకసారి గమనిస్తే... సీతారాములు చిత్రంలో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడిగా కృష్ణంరాజు నటించగా ఫ్యాక్టరీకి ఓనర్ పాత్రలో జయప్రద మెరిసింది. ఇక ఘరానామొగుడు చిత్రంలో కూడా అంతే. నగ్మా ఫ్యాక్టరీ ఓనర్ గా.. చిరంజీవి కార్మికుడిగా ఉంటారు. నగ్మా పొగరుబోతు పాత్రలో కనిపించింది. అక్కడ కూడా అంతే... జయప్రద కార్మికుల సమస్యలని పట్టించుకోని పొగరుబోతు ఓనర్ గా ఉంటుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం.. కార్మిల వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరగడం రెండు సినిమాలలోనూ మనం చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: