అల్లు వారి వారసుడు అల్లు అర్జున్ గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ అండతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ అనతి కాలంలోనే తెలుగు చిత్ర సీమలో అగ్ర హీరోల సరసన చేరి, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఇక ఈ క్రమంలో పుష్ప అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయి అందుకుని బాలీవుడ్ లో కూడా సత్తా చాటాడు. ఇక రాబోతున్న పుష్ప 2 సినిమా గురించి కూడా బాలీవుడ్ మాట్లాడుకుంటుంది అంటే అర్థం చేసుకోవాలి... అల్లు అర్జున్ స్థాయి ఏమిటనేది?

ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ అగ్ర నటుడు అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలా హాట్ టాపిక్ గా మారాయి. ఎలాంటి అంచనాలు లేని పుష్ప సినిమా బాలీవుడ్ లో 100 కోట్లు కలెక్ట్ చేసి, అక్కడ హీరోలను సైతం ఆశ్చర్యపోయేలా చేసిందని తాజాగా ఓ మీడియా వేదికలో అజయ్ దేవగన్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ ను చూసి చాలామంది అసూయ కూడా పడినట్టు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలను అల్లు వారి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.... తమ హీరో అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మా హీరో కి సాటి ఎవరంటూ గొప్పలు పోతున్నారు.

నిజమే, సుకుమార్ దర్శకత్వంలోని తెరకెక్కిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన అనిర్వచనీయమైనది. సినిమా కలెక్షన్ లో ఎలా ఉన్నా ఈ సినిమా క్రిటిక్స్ ని సైతం మెప్పించిన మాట వాస్తవమే. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో కూడా ఒక రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది. దాంతో పుష్ప సినిమాకి కొనసాగింపుగా వస్తున్న సినిమా పుష్ప 2 పైన కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా 1000కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకుందని గుసగుసలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: