అందాల ముద్దు గుమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నాగ చైతన్య హీరోగా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. కాకపోతే ఇందులో పూజ హెగ్డే తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ తెలుగులో వచ్చింది. ఇక ఈ బ్యూటీ తెలుగు లో భారీ అవకాశాలు వచ్చిన సమయం లో కూడా హిందీ సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని చూపించింది.

కానీ ఈమె కు హిందీ లో మంచి విజయాలు దక్కలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీ మళ్లీ తెలుగు వైపు ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది. తెలుగు లో ఈమెకి మంచి విజయాలు దక్కాయి. స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు దక్కాయి. దానితో ఈమె తక్కువ టైం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. అలా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె తమిళ ఇండస్ట్రీ వైపు ఆసక్తిని చూపించింది. అందులో భాగంగా ఏకంగా కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఈమెకు ఈ సినిమా తర్వాత భారీ ఎత్తున తమిళ సినిమాల్లో అవకాశాలు రాలేదు. మళ్లీ విజయ్ హీరోగా రూపొందుతున్న తమిళ సినిమాలో ఈమె హీరోయిన్గా నటిస్తోంది. ఇలా ఎన్నో ఆశలతో తమిళ సినిమాల్లో నటించిన ఈమెకు మొదటి సినిమాతోనే తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: