ర్తి సురేష్ గ్లామర్ హీరోయిన్ గా మారాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను ప్రేక్షకులు మంచి నటిగా మాత్రమే గుర్తిస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం ఆమె ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల పైనే దృష్టి పెడుతోంది. అయితే ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతిలా ఎదగాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ముందుకు నడవడంలేదు. దీనికికారణం ఆమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు అన్నీ రకరకాల కారణాలతో ఫెయిల్ అయ్యాయి.



గతంలో ఆమె హారర్ జానర్ లో నటించిన ‘పెంగ్విన్’ ఆమె ఎంత కష్టపడి నటించినప్పటికీ అది ఫెయిల్ అయింది. ఆతరువాత వచ్చిన ‘మిస్ ఇండియా’ ను కూడ ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఈ ఫ్లాప్ లు తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఆమె నటించిన ‘గుడ్ లక్ సఖి’ ఆమెకు లక్ ను ఇవ్వలేదు. నగేష్ కు కునూర్ లాంటి కొత్త డైరెక్టర్ తీసినప్పటికీ ఆసినిమా ఓటీటీ ప్రేక్షకులకు కూడ పెద్దగా నచ్చలేదు.



దీనితో ఆమె ‘రఘు తాత’ అంటూ పలకరించి తన విభిన్నమైన నటనను ప్రదర్శించాలని ప్రయత్నించినప్పటికీ ఆప్రయత్నాలు కూడ సక్సస్ కాలేదు. ఇప్పుడు తన రూట్ మార్చి ‘రివాల్వర్ రీటా’ అంటూ మరొక కొత్త ప్రయోగం చేస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ ను లేటెస్ట్ గా విడుదల చేశారు. ఈమూవీ కాన్సెప్ట్ ఎక్కువ అర్థం అవ్వకుండా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈసినిమా అయినా ఈమెకు అదృష్టాన్ని కల్గిస్తుందో లేదో చూడాలి.



ఈ ప్రయత్నాలు చేస్తూ ఉండగానే ఆమె బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో నటించిన ‘బేబీ జాన్’ రిలీజ్ కు రెడీ అవుతోంది. తమిళ టాప్ హీరో విజయ్ నటించిన ‘తేరి’ మూవీకి రీమేక్ గా ఈమూవీ నిర్మాణం జరుపుకుంటోంది. డిసెంబర్ లో రాబోతున్న క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీలో కీర్తి బాగా గ్లామర్ షో చేసింది అని వార్తలు వస్తున్నాయి. మరి బాలీవుడ్ ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: