భారీ సినిమా దగ్గర నుండి చిన్న సినిమా వరకు ఆసినిమా ప్రారంభోత్సవ ముహూర్తం రోజునే ఓటీటీ సంస్థలకు తమ సినిమాలను ఎలా అమ్మాలి అన్న ఆలోచనలతో తమ సినిమాల నిర్మాణాన్ని మొదలు పెడుతున్నారు అన్నది వాస్తవం. కరోనా సమయంలో ధియేటర్లు మూత పడటంతో సినిమాలు చూసే అలవాటు ఉన్న వారంతా ఓటీటీ యాప్ ల వైపు అడుగులు వేయడంతో ప్రజల జీవన సరళిలో ఓటీటీ లు ఒక ప్రధాన భాగంగా మారిపోయాయి.



కరోనా పరిస్థితులు తరువాత ధియేటర్లు ఓపెన్ అయినప్పటికీ ప్రేక్షకులు ఓటీటీ లలో సినిమాలు చూసే అలవాటు కొనసాగుతూ ఉండటంతో అనేక ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీ పెట్టుబడులను పెట్టాయి. అయితే ఓటీటీ సంస్థల సభ్యత్వం మాత్రం ఓటీటీ సంస్థలు ఆశించిన స్థాయిలో పెరగకుండా ఒక స్థాయిలో ఆగిపోవడంతో ఎలర్ట్ అయిన ఓటీటీ సంస్థలు ఇప్పుడు తాము కొనుక్కునే సినిమాలకు సంబంధించిన నియమ నిబంధనలను బాగా మార్చుకుని తమ వద్దకు వచ్చే నిర్మాతలకు కండిషన్స్ పెడుతూ ఉండటంతో ఓటీటీ ఆదాయం నిర్మాతలకు ఆశించిన స్థాయిలో ఉండటంలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.



దీనికితోడు టాప్ హీరోల సినిమాల నుండి చిన్న సినిమాల వరకు ఆసినిమాలను ఎప్పుడు విడుదల చేయాలి అన్న కండిషన్స్ కూడ ఓటీటీ కంపెనీలు బాగా పెడుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. దీనితో ఒక సినిమా రిలీజ్ డేట్ నిర్మాతల చేతిలో ఉండటంలేదనీ ఆ రిలీజ్ డేట్ ను ఓటీటీ సంస్థలు నిర్ణయిస్తున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.  



అంతేకాదు కొన్ని ఓటీటీ సంస్థలు తాము చెప్పిన డేట్ కు నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసినప్పుడు మాత్రమే అనుకున్న రేట్ ఇస్తామనీ లేకుంటే ఆ రేట్ ని తగ్గిస్తామని కూడ ఓటీటీ సంస్థలు నిర్మాతను కార్నర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రాబోతున్న ఇక సంక్రాంతి సినిమాల విషయంలో రిలీజ్ డేట్ల మార్పులు చేర్పుల విషయంలో కూడ ఓటీటీ సంస్థలు చెపుతున్న కండిషన్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలు కలవర పడుతున్నారు అంటూ వార్తల హడావిడి నడుస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: