ఆ హీరోయిన్ ఎవరో కాదు అలనాటి మేటినటి సుజాత. ఆ దర్శకులు ఎవరో కాదు బాలచందర్. దాసరి నారాయణరావు. బాలచందర్‌కి ఏ హీరోయిన్ అయినా నచ్చితే ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్ స్టేజ్‌కు తీసుకు వెళ్ళే వరకు నిద్రపోయేవారు కాదట. సరిత, సుజాత ఆయన చేతిలో చెక్కిన శిల్పాలుగా ఎదిగిన వారు. అలాగే దర్శికరత్న దాసరి నారాయణరావు కూడా సుజాతకు తెలుగులో ఎన్నో అవకాశాలు ఇచ్చే ప్రోత్సహించారు. వీరిద్దరి సినిమాలలో ఎక్కువగా నటించిన సుజాత.. వారిని తన గురువుగా భావించింది. అయితే గురువుల రుణం తీర్చుకునే క్రమంలో సుజాత వారి ఇళ్లల్లో శుభకార్యాలు.. ఇతర ఫంక్షన్లు జరిగినా.. అక్కడ ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవారట.
ఇది నచ్చని సుజాత భర్త ముదికర్ ఆమెను విపరీతంగా టార్చర్ పెట్టేవాడట. నీకు వారిద్దరితో సంబంధాలు ఉన్నాయా చెప్పు.. అసలు నీకు ఎంతమందితో లింకులు ఉన్నాయి అంటూ తీవ్రంగా టార్చర్ పెట్టేవాడట. చివరకు ఆమె ఆస్తులని తీసుకొని అతడు కేరళ లోని ఎర్నాకులం వెళ్ళిపోగా.. సుజాత తన కొడుకు సుజిత్ తో కలిసి చెన్నైలో ఉండిపోయింది. ఆ తర్వాత ఆమె క్యాన్సర్ భారిన పడి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. సుజాత స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు ఆమె భర్త సుజాత రేంజ్‌కు సరితూగకపోయినా.. పదేపదే తన వెంట పడుతున్నాడు అన్న కారణంతో పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేసింది అన్న ప్రచారం అప్పట్లో వినిపించింది.