కొన్ని సంవత్సరాల క్రితం వరకు మన తెలుగు సినీ పరిశ్రమలో ఒక మూవీ అనౌన్స్మెంట్ అయ్యింది అంటే ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే సినిమాలు మొదలయ్యేవి. భారీ ఎత్తున దర్శకులు ప్రీ ప్రొడక్షన్ పనులకు సమయాన్ని కేటాయించేవారు కాదు. సినిమాను మొదలు పెట్టి ఆ తర్వాత దానికి అనుగుణంగా ప్రీ ప్రొడక్షన్ పనులను చేసుకుంటూ సినిమాను చాలా తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేవారు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మన తెలుగు దర్శకులు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

దానితో అన్ని భాషల ప్రేక్షకులకు సినిమాను నచ్చే విధంగా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మంచి లొకేషన్లు ను వెతకడం. కథ ఏ విధంగా ఉండాలి. హీరో , హీరోయిన్లు ఎలా ఉండాలి. ఇలా అన్నింటిపై పరిశోధన చేసి ఆ తర్వాత సినిమాను మొదలు పెడుతున్నారు. దానితో ప్రీ ప్రొడక్షన్ పనులకే చాలా సమయాన్ని దర్శకులు తీసుకుంటున్నారు. ఇక చాలా కాలం నుండి ప్రీ ప్రొడక్షన్ పనులకు అత్యంత ఎక్కువ సమయం తీసుకునే దర్శకులలో తెలుగు సినిమా పరిశ్రమ నుండి రాజమౌళి కనిపించేవాడు. ఈయన సినిమా మొదలు కాకముందే చాలా కాలం టైం తీసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా ముగించి అప్పుడే సినిమాను స్టార్ట్ చేసేవాడు. ఇక ఈయన కోవలోకే బుచ్చిబాబు సనా కూడా చేరినట్లు తెలుస్తుంది. ఈయన రామ్ చరణ్ హీరోగా తన నెక్స్ట్ మూవీ ని చేయబోతున్నాడు.

మూవీ కి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. ఇప్పటికి కూడా ఈయన ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను చేస్తూనే ఉన్నాడు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ను ఈ సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో మొదలు పెట్టే ఆలోచనలో బుచ్చిబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా బుచ్చిబాబు ప్రీ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం తీసుకోవడంతో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: