మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఓ సినిమాలో హీరో గా నటించిన దాని ద్వారా ఈయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత సినిమాల్లో విలన్ పాత్రలో నటించడం మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఈయన జయం , వర్షం , నిజం సినిమాలలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూడు మూవీలలోని ఈయన నటనకు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఆ తర్వాత ఈయన మళ్ళీ సినిమాల్లో హీరో గా నటించిన మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఈయన హీరో గా నటించిన సినిమాలు కూడా చాలా వరకు మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి.

కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈయనకు పెద్దగా విజయాలు దక్కడం లేదు. తాజాగా ఈయన విశ్వం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కావ్య దాపర్ హీరోయిన్గా నటించగా ... శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వప్రసాద్ నిర్మించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 11 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే కేవలం గోపీచంద్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కావ్య దాపర్ , ఈ మూవీ కి దర్శకత్వం వహించిన శ్రీను వైట్ల , ఈ మూవీ ని నిర్మించిన విశ్వ ప్రసాద్ వీరంతా కూడా ప్రస్తుతం అపజయాలతోనే కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

ఇక ఈ సినిమాకి మొదట మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర రాబడుతుంది. ఈ మూవీ ఇలా దాదాపుగా హిట్ స్టేటస్ కి దగ్గరికి వెళ్లడంతో గోపీచంద్ , కావ్య దాపర్ , శ్రీను వైట్ల , టీ జీ విశ్వప్రసాద్ కి పెద్ద ఊరట లభించినట్లు అయింది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీ ఫైనల్ బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gc