మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని దీపికా పదుకొనే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె పది సంవత్సరాలలో నటించిన సినిమాలు మొత్తంగా 7000 కోట్ల కలెక్షన్లను వసూలు చేశాయి. అలా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకుంది. మరి ఈమె నటించిన ఏ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసింది అనే వివరాలను క్లియర్గా తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా దిశ పటాని హీరోయిన్ గా రూపొందిన కల్కి 2898 AD సినిమాలో ఈమె కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక దీపికా పదుకొను కొంత కాలం క్రితం ఫైటర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఏకంగా 337 కోట్ల కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. పోయిన సంవత్సరం ఈ బ్యూటీ షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన పటాన్ , జవాన్ రెండు సినిమాలలో కూడా హీరోయిన్గా నటించింది. ఇక పటాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1148 కోట్ల కలక్షన్లను వసూలు చేయగా , జవాన్ సినిమా 1050 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. 

2018 వ సంవత్సరం దీపికా పదుకొనే పద్మావత్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 572 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. 2017 సంవత్సరం వచ్చిన XXX రిటర్న్ ఆఫ్ క్సాండర్ సినిమామూవీ 2600 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. 2017 వ సంవత్సరం వచ్చిన బాజీరావు మస్తానీ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించింది .ఈ మూవీ 356.2 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. 2014 వ సంవత్సరం విడుదల అయిన హ్యాపీ న్యూ ఈయర్ సినిమా 408 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా ఆఖరి పదేళ్లలో ఈ ముద్దు గుమ్మ నటించిన అన్ని సినిమాలు కలిసి దాదాపు 7000 కోట్ల వరకు కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: