తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు కొందరు హీరోలకు హీరోయిన్లు దొరకటం ఎంతో కష్టమైంది.. గతంలో స్టార్ హీరోల నుంచి యంగ్‌ హీరోలకి కూడా హీరోయిన్ల దొరకటం కష్టంగా మారింది. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ ఇల సీనియర్ హీరోలకు హీరోయిన్ సమస్య తీవ్రంగా ఉండేది. ఇప్పుడు వారి జాబితాలో యంగ్ హీరో అడివి శేష్‌ కూడా చేరిపోయాడు.ఈ యువ హీరో వ‌రుస విజ‌య‌లతో ఫామ్ ల ఉన్న హీరోయిన్లు దొరకక సినిమా షూటింగ్ లు ఆగిపోయే పరిస్థితి వచ్చింది.


మేజ‌ర్, హిట్ 2  సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్న అడివి శేష్.. సంవత్సరం పైగా గ్యాప్ తీసుకుని సినిమాలు మొదలుపెట్టాడు. గూడచారి సినిమాకు సిక్వల్ గా జి 2 సినిమా చేస్తున్నాడు అలాగే సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన షానీల్‌ డియో డైరెక్షన్లో డకాయిట్ అనే మూవీ కూడా చేస్తున్నాడు  అదేవిధంగా మేజర్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అడవిశేష్. అలాగే అక్కడ అమ్మాయిల్లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. దీంతో బాలీవుడ్ హీరోయిన్ అడివి శేష్ తో సినిమా చేయడానికి రెడీ అయిందని కూడా అన్నారు..


బాలీవుడ్ లో రెండు మూడు సినిమాల్లో నటించిన బనితా సందు హీరోయిన్గా చేయడానికి రెడీగా ఉంది.. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పకు వచ్చింది. గూడచారి 2 లో ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేయగా ఆమె మాత్రం వేరే కారణాలతో సినిమా నుంచి తప్పుకుంది. అలాగే డకాయిట్ సినిమాలో కూడా హీరోయిన్ గా ముందుకు స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఎంచుకున్నారు. ఆమె కూడా ఇప్పుడు సినిమా నుంచి తప్పుకుంది. అయితే ఆమె డైరెక్టర్ కాకుండా సినిమాలో కొన్ని సీన్స్ ను అడవి శేష్ తెర‌కెక్కించాడని అది నచ్చక ఆమె తప్పు ఉందని అంటున్నారు.  


ఇప్పటికే గూఢచారి 2 డకాయిట్‌ సినిమాలు షూటింగ్  మొదలు కాగా ఈ రెండు సినిమాలకు ఇప్పుడు హీరోయిన్లు దొరకటం లేదు.  హీరోయిన్లు లేని సన్నివేశాలను హీరోని పెట్టి తెర‌క్కెకేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు హీరోయిన్ దొరకకపోతే సినిమాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు హీరోయిన్లను సినిమాల్లో నటించమని అడిగిన వారు నో చెబుతున్నారని టాక్ కూడా ఉంది. ఇప్పుడు ఏది ఎలా ఉన్నా సినిమాల్లో అవకాశాల కోసం తీవ్రంగా ట్రై చేస్తున్న అమ్మాయిలు అడివి శేష్ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించడానికి దొరకపోవడం చిత్ర పరిశ్రమలో షాకింగ్ విషయమనే చెప్పాలి.
:

మరింత సమాచారం తెలుసుకోండి: