మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేసి ప్రస్తుతం వార్ 2 షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఈ సంవత్సరం చివరి కల్లా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి ప్రశాంత్ నీల్‌ సినిమా ను మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు . అయితే ఇదే సమయంలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఎన్టీఆర్ తో సినిమా అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ హీరోయిన్ అయినా నటించడానికి సై అంటుంది .


ఇప్పటికే దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కు లైఫ్ ఇచ్చాడు తారక్‌ .. అలాంటి ఎన్టీఆర్ మూవీలో ఆఫర్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తుంటే ఓ హీరోయిన్ మాత్రం ఎన్టీఆర్ సినిమా ని రిజెక్ట్ చేసిందట .. అది కూడా మూడుసార్లు .. ప్రస్తుతం ఇదే వార్త బాలీవుడ్ మీడియాను షేక్ చేస్తుంది . మూడు సార్లు ఎన్టీఆర్ తో నటించే అవకాశం వచ్చిన అప్పటికీ రకరకాల కారణాలు చెప్పి ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిందట .


ఇక ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఎన్నోసార్లు స్టోరీ నచ్చగా మరి కొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ గా అడగడంతో ఆమె ఆ సినిమాల ను రిజెక్ట్ చేసిందట. ఇలా గతంలో ఎన్టీఆర్ నటించిన హిట్ సినిమాలను ఆమె వదులుకుంది. అయితే గతం లో జరిగిన పలు ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాత్రం అలియా భట్ అంటే తన ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పుకొచ్చారు .. అలాగే త్రిబుల్ ఆర్ ప్రమోషన్లు కూడా ఆలియా ఎన్టీఆర్ తో తనకు ఫుల్ లెన్త్ సినిమా చేయాలని ఉందని స్టోరీలు నచ్చక సినిమా చేయలేకపోతున్నాను అంటూ చెప్పుకు వచ్చింది . అయితే రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా చేస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: