అయితే హీరో సూర్య ఏమీ ఆమె మీద పగతోనో ..? లేకపోతే వేరే కారణంగానో లాగిపెట్టి కొట్టలేదట . ఆయన సినిమా షూటింగ్లో భాగంగా అలా కొట్టాల్సిన పరిస్థితి వచ్చిందట . హీరో సూర్య కెరియర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సిరీస్ సింగం . సింగం 1..న్ సింగం 2.. సింగం 3 అంటూ ఓ రేంజ్ లో బాక్స్ ఆఫిస్ ని షేక్ చేసేసాడు. సింగం 2 సినిమాలో హన్సిక సూర్య తో స్క్రీన్ షేర్ చేసుకుంది . ఈ క్రమంలోనే సినిమా షూటింగ్లో భాగంగా ఒకసారి హన్సిక అబద్ధం చెప్పి సూర్యుని బీచ్ వద్దకు రప్పించుకుంటుంది . అయితే అదే మూమెంట్లో సూర్య ఆమెను లాగిపెట్టి కొట్టాల్సిన సీన్ ఉంటుంది . ఎంత ట్రై చేసినా ఎక్స్ప్రెషన్స్ నాచురల్ గా రాకపోతూ ఉండడంతో.. డైరెక్టర్ హరి నిజంగానే హన్సికను లాగిపెట్టి కొట్టమంటూ సూర్యకు చెప్పారట.
ప్రాబ్లమ్ అవుతుందేమో ..? తను హర్ట్ అవుతుందేమో ..? అని చెప్పాడట సూర్య . హన్సిక దానికి ఏమాత్రం బాధపడలేదట . సినిమా కోసం ఏదైనా ఓకే ..కొట్టండి నాచురల్ ఎక్స్ప్రెషన్స్ రావాలి.. సినిమా హిట్ అవ్వాలి అంటూ ఓపెన్ గానే సూర్యకి డైరెక్టర్ హరికు చెప్పుకొచ్చిందట . అనుకున్న విధంగానే షాట్ రెడీ అవ్వగానే సూర్య - హన్సిక ను లాగిపెట్టి కొట్టడం.. అప్పుడు నిజంగానే హన్సిక ఏడవడం ..ఆ షాట్స్ చాలా న్యాచురల్ గా రావడంతో డైరెక్టర్ హరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట .
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే అప్పట్లో కొంతమంది మాత్రం హన్సిక ను బాగా ట్రోల్ చేశారు. పెళ్లి అయిపోయిన కూడా హన్సిక సూర్య పై మోజు పడింది ఏమో.. అందుకే లాగిపెట్టి కొట్టాడు.. ఏం గబ్బు పని చేసిందో ఏమో అంటూ ట్రోల్ చేశారు. అయితే ఆ తర్వాత డైరెక్టర్ హరినే ఇలా జరిగింది అంటూ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టడంతో ఆమెపై జరిగిన ట్రోలింగ్ ఆగిపోయింది . ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన హన్సిక ఒక్కొక్క నిర్ణయాన్ని ఆచితూచి తీసుకుంటుంది..!!