. . . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

డైలాగ్ కింగ్‌ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ హీరో గా టాలీవుడ్ కు పరిచయమైన తొలి సినిమా ప్రేమ కావాలి .. సీనియర్ డైరెక్టర్ విజయభాస్కర్ తెరకెక్కించి న ఈ సినిమా 2011 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది .. ఇక ఈ సినిమాలు ఇషా చావ్లా హీరోయిన్ గా నటించింది . ఈ సినిమాతో నే హీరోయిన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టిన ఇషా తొలి సినిమా తోనే తన అందం అభినయం తో ప్రేక్షకుల ను మెప్పించింది . అలాగే ఈ మూవీలో సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి .


అలాగే ఇషా చావ్లాకు కూడా మంచి క్రేజ్‌ తెచ్చిపెట్టింది . ప్రేమ కావాలి మూవీ హిట్ కావ‌డంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకోంది .. ఆ తర్వాత అతి తక్కువ సమయం లోనే ఇండస్ట్రీలో రాణించింది. ఆ  తర్వాత ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసి రాలేదు.. తెలుగులో వరుస‌ ఆఫర్స్ వచ్చాయి కానీ స్టార్డం అందుకోలేదు. తర్వాత చిన్న చిన్న సినిమాలో నటించిన ఇషా చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంది.


ఇక ప్రస్తుతం తెలుగులో రియంట్రీ ఇచ్చేందుకు ఈ ముద్దుగుమ్మ రెడీ అయింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా లో ఈమె నటిస్తున్నట్లు తెలుస్తుంది . దాదాపు పది సంవత్సరాల గ్యాప్ తర్వాత తిరిగి ఈమె టాలీవుడ్లో నటిస్తుంది ఇషా .. ఇప్పుడు తాజా గా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. అప్పటికన్నా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడే ఎంతో హాట్ గా మారింది. చదువు పూర్తయిన వెంటనే యాక్టింగ్ కోర్స్ తీసుకున్న ఢిల్లీ బ్యూటీ ఇప్పుడైనా సరైన సినిమాలు చేస్తూ స్టార్ డం తెచ్చుకుంటుందో లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: