మగధీర సినిమా పేరు వినగానే అందరికీ ముందుగా దర్శక ధీరుడు రాజమౌళి పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. అప్పటి వరకు ఒక మూస ధోరణిలో వెళ్ళిపోతున్న సినిమాను వేరే రూట్లో దారి మళ్లించిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. మగధీర సినిమా హీరో రామ్ చరణ్ కి రెండో సినిమా అయినప్పటికీ, ఎక్కడా జంకకుండా జక్కన్న తెరకెక్కించిన విధానం మాత్రం న భూతొ న భవిష్యతి. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ వేయడం నుండే, ప్రేక్షకుడిని సినిమాలోని లీనమయ్యేలా చేసాడు జక్కన్న. ఇక ఆయన దర్శకత్వ ప్రతిభ గురించి మాట్లాడుకోవలిసిన పనిలేదు. నేడు తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న, తక్కువగానే ఉంటుంది.

అసలు విషయంలోకి వెళితే, మగధీర సినిమాలోని కీలక సీన్ 'హీరో హీరోయిన్ల గతం తాలుక షాట్స్' గురించి అందరికీ తెలిసిందే. హీరోయిన్ మిత్రవింద పాత్రధారి కాజల్ అగర్వాల్ ని ముట్టుకొనే సమయంలో, కాల భైరవ పాత్రధారి రామ్ చరణ్ ఒక రకమైన స్పార్క్ ని ఫీల్ అవుతూ, కరెంటు షాక్ కొట్టిన వాడిలా ఫీల్ అయ్యి, గత జన్మ తాలుక జ్ఞాపకాలను నెమరువేసుకుంటాడు. అక్కడినుండి అసలు కథ మొదలవుతుంది. అది చూడడానికి బాగా అనిపించినప్పటికీ దర్శకుడు అక్కడే పెద్ద బొక్క పెట్టాడని విశ్లేషకులు అప్పట్లో మాట్లాడుకునేవారు. అయితే సినిమా చూసిన సగటు ప్రేక్షకుడు మాత్రం అవేమీ పట్టించుకోకుండా సినిమాలోని లీనమై మరీ జక్కన్న సినిమాని ఆస్వాదిస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు!

విషయం ఏమిటంటే, అలా ఒక సందర్భంలో హీరోయిన్ ని తాకిన హీరోకి షాక్ తగిలినప్పుడు, వారిద్దరూ కలుసుకున్నపు, కౌగిలించుకున్నపుడు మాత్రం ఎటువంటి షాకులు తగలవు. ఆ సమయంలో ఇదెక్కడి లాజిక్కండి బాబు? అనే అనుమానం కలగక మానదు. ఇదే విషయాన్ని అప్పట్లో కొంతమంది క్రిటిక్స్ వేలెత్తి చూపుతూ విమర్శలు గుప్పించారు. అయితే అవేవీ పట్టని సాధారణ ప్రేక్షకుడు మాత్రం ఆసాంతం సినిమాని ఎంజాయ్ చేసి, సూపర్ డూపర్ హిట్టు చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: