మెగాస్టార్ కుమారుడుగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంతంగా ఒక బ్రాండ్ ను ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉన్న రామ్ చరణ్ rrr సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇందులో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందని హాలీవుడ్ స్థాయి నటీనటులు కూడా ప్రశంసించారు. దీంతో ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. అలా చాలామంది హాలీవుడ్ దర్శకులు, యాక్టర్స్ సైతం రామ్ చరణ్తో కలిసి పనిచేయడానికి చాలా ఆసక్తిగా చూపించారు.


అయితే రామ్ చరణ్ మాత్రం హాలీవుడ్లో నటించడానికి ఒప్పుకోలేదు. అందుకు గల కారణాన్ని కూడా ఇటీవలే తెలియజేయడం జరిగింది. జమ్ము కాశ్మీర్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి వెళ్లిన రామ్ చరణ్ అక్కడ ఒక యాంకర్ హాలీవుడ్ లో సినిమాలు చేయడం గురించి ప్రశ్నించిందట దీనికి రామ్ చరణ్ తెలియజేస్తూ.. తాను ఇండియాలో చాలా సాధించాలి తాను తన సాంస్కృతికి చాలా కట్టుబడి ఉంటాను భారతీయ భావాలకు చాలా విలువనిస్తాను మన సంస్కృతి చాలా బలమైనది మన కథలలో చాలా గౌరవం ఉంటుంది అందుకే తాను ఇండియన్ సినిమా గురించి  చాటి చెప్పడానికే కృషి చేస్తూ ఉంటాను అంటూ రామ్ చరణ్ తెలిపారు.



రామ్ చరణ్ చెప్పిన ఈ వార్తలు విన్న అభిమానులు సైతం అవకాశాలు వచ్చినా కూడా భారతీయ సంస్కృతిని వదిలిపెట్టకుండా ఇక్కడే నటిస్తానని చెప్పడం మాకు చాలా గర్వంగా ఉంది అంటూ కాలరేగరేస్తున్నారు అభిమానులు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన అంజలి మరొక కీలకమైన పాత్రల నటిస్తున్నది ఈ చిత్రాన్ని శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు బ్యానర్ పైన పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: