* హీరోయిన్ల అందు ఆ హీరోయిన్ వేరేయా

* ఆమె నిర్మాతలకు దేవత

* ఎంతోమంది నిర్మాతలకు డబ్బు తిరిగి ఇచ్చేసింది  

( ఏపీ - ఇండియా హెరాల్డ్)

మన సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో మంచి, పెద్ద మనసున్న హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో సాయి పల్లవి, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లు ముందు వరుసలో ఉంటారు. వీరు డబ్బులు కోసం ఎప్పుడూ సినిమాలు చేయరు. మంచి పాత్రలు చేసి ప్రేక్షకులను బాగా అలరించాలనేదే వారి లక్ష్యం. నటన పట్ల వారికి చాలా మక్కువ ఉంటుంది. అదే వారి ప్యాషన్. చాలా తక్కువ డబ్బులు ఇచ్చి నటించమని చెప్పినా పాత్ర నచ్చితే నటిస్తారు. అందుకే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వారికి ఎవరికీ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్, గౌరవం లభిస్తుంది.

నిత్యామీనన్ చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తుంది. ఆమెకు ఇటీవల నేషనల్ ఫిలిం అవార్డు కూడా లభించింది. ఈ కర్ణాటక ముద్దుగుమ్మ తెలుగులో "అలా మొదలైంది" సినిమాతో పరిచయమయ్యింది. రొమాంటిక్ కామెడీ డ్రామా "ఇష్క్"తో ఒకసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి జనతా గ్యారేజీ, గీతా గోవిందం లాంటి రీసెంట్ హిట్స్ లో కూడా నటించి మెప్పించింది. అయితే ఆమె చేసిన కొన్ని సినిమాలు ఫెయిల్ కూడా అయ్యాయి. అలాంటి సందర్భాల్లో ఆమె తాను తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి నిర్మాతలకు ఇచ్చేసింది. "సినిమా హిట్ అవ్వలేదు కదా సార్ మీకు నష్టం రావద్దు" అంటూ ఆమె చాలాసార్లు డబ్బులు తిరిగి ఇచ్చింది. ఓ సినిమా ప్రొడ్యూసర్ కు కూడా ఆమె అలాగే డబ్బులు పంపింది కానీ ఆయన వాటిని తీసుకునేందుకు నిరాకరించాడు. తిరిగి ఆమెకు పంపించాడు కానీ ఆమె మళ్ళీ అతనికి పంపించింది. ఆ సినిమా మరేదో కాదు విశాఖ్‌ ఖండేరావు దర్శకత్వం వహించిన "స్కైలాబ్".

ఈ సినిమాలో నిత్య మీనన్, సత్యదేవ్‌, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి, తులసి వంటి నటులు నటించారు. ఈ మూవీ కథ 1979లో జరుగుతుంది. అమెరికా అంతరిక్ష కేంద్రం స్కైలాబ్ భూమి మీద పడే సమయంలో, బండలింగంపల్లిలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. గౌరి, ఆనంద్, రామారావు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు. స్కైలాబ్ పడే సమయంలో ఈ మూడు పాత్రలు ఎలాంటి అనుభవాలను పొందాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పేపర్ పైన ఈ స్టోరీ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. స్క్రీన్ ప్లే బోరింగ్ సాగింది. గ్రాఫిక్స్ అంతగా బాగోలేదు. వెరసి ఈ మూవీ ఎదురు తన్నింది. పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాని నిర్మించాడు. నిత్యామీనన్ కూడా ఈ మూవీ ని బ్యాంకు రోల్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: