2002 సంవత్సరం ఆగష్టు నెల 15వ తేదీన విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పును పొందే విషయంలో ఫెయిలైంది. అయితే ఈ సినిమా వల్ల బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తంలో నష్టపోయారని తన దృష్టికి రావడంతో రజినీకాంత్ వాళ్లను ఆదుకునే దిశగా అడుగులు వేయడం జరిగింది. అప్పటివరకు సినిమా ఫ్లాపైతే నిర్మాతకు మరో సినిమా నిర్మించే ఛాన్స్ ఇచ్చేలా ఇండస్ట్రీలో హీరోలు వ్యవహరించేవారు.
డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లను ఆదుకోవడం మాత్రం బాబా సినిమాతోనే మొదలైందని ఈ విషయంలో రజినీకాంత్ ఇండస్ట్రీలో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ తాజాగా వేట్టయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. జైలర్ మూవీ రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు.
అయితే కూలీ సినిమా లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా రజనీకాంత్, రజనీకాంత్ అభిమానులు కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. లోకేశ్ కనగరాజ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. కూలీ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరిగింది. 2025 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు.