- తండ్రి బాటలోనే రామ్ చరణ్..
- నిర్మాతలకి బంగారు బాతు..
- సినిమాలు ప్లాప్ అయితే రెమ్యూనరేషన్ వెనక్కి..

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత మూవీతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి ఈ హీరో కేవలం సినిమాలోనే కాదు ఎవరినైనా ఆదుకోవడంలో కూడా ముందుంటారు.. అయితే ఇప్పటివరకు తన  సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాతలను రాంచరణ్ ఎలా ఆదుకున్నారో ఇప్పుడు చూద్దాం..

 నిర్మాతలను ఆదుకున్న ఘనుడు:

 రామ్ చరణ్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే అందులో కొన్ని సినిమాలు కలెక్షన్లు కూడా రాకుండా భారీ డిజాస్టర్  అయ్యాయి.అయితే అలాంటి కొన్ని సినిమాలకు రాంచరణ్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా వెనక్కి ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.అయితే అందులో ఒకటి ఆరెంజ్.. నాగబాబు నిర్మాతగా చేసిన ఆరెంజ్ మూవీ నవంబర్ 26, 2010లో వచ్చి భారీ డిజాస్టర్ అయింది.రామ్ చరణ్ జెనీలియా కాంబోలో వచ్చిన ఈ మూవీ బిజినెస్ చేయలేదు.దాంతో ఈ మూవీ భారీ డిజాస్టర్ అవ్వడంతో నిర్మాత సొంత బాబాయ్ కావడంతో రామ్ చరణ్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమా చేశారు. ఇక ఆరెంజ్ మూవీ వల్ల నాగబాబు ఎంతో నష్టపోయారు. అయితే ఈ సినిమా మళ్లీ రీ రిలీజ్ లో రికార్డు సృష్టించి భారీ లాభాలను తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా వల్ల వచ్చిన లాభాలను నాగబాబు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆరంజ్ సినిమా అప్పటి జనరేషన్ కి కాకుండా ఇప్పటి జనరేషన్ కి కరెక్టుగా సెట్ అవ్వడంతో ఈ మూవీ రీ రిలీజ్ లో భారీ హిట్ అయింది.


ఇక మరో మూవీ గోవిందుడు అందరివాడేలే.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడేలే మూవీలో కాజల్,రామ్ చరణ్ లు నటించారు. ఈ సినిమాకి బండ్ల గణేష్ నిర్మాతగా చేశారు. అయితే ఈ సినిమా హిట్ అయినప్పటికీ ఈ సినిమా విడుదల చేయడానికి ముందు నిర్మాత బండ్ల గణేష్ సినిమా విడుదల చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.ఆ విషయం తెలుసుకున్న రాంచరణ్ మంచి మనసుతో ఈ సినిమాకి దాదాపు రెండు కోట్ల వరకు పారితోషికాన్ని తగ్గించుకున్నారు. దాంతో ఈ సినిమాని రామ్ చరణ్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ తో విడుదల చేసి హిట్టు కొట్టారు బండ్ల గణేష్. ఇక ఈ రెండు సినిమాలే కాదు భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ అయిన బ్రూస్ లీ సినిమాకి కూడా రామ్ చరణ్ తాను తీసుకున్న రెమ్యూనరేషన్ లో కొంత తిరిగి ఇచ్చేశారు.. శ్రీను వైట్లా దర్శకత్వంలో 2015 అక్టోబర్ 16న విడుదలైన బ్రూస్ లీ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ అయింది. రామ్ చరణ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమా ఫ్లాఫ్ అవ్వడంతో రామ్ చరణ్ తాను తీసుకున్న రేమ్యూనరేషన్ లో కొంత తిరిగి ఇచ్చారు. అలా ఈ హీరో కేవలం రెమ్యూనరేషన్ తీసుకోవడంలోనే కాదు సినిమా ఫ్లాప్ అయితే తిరిగి ఇచ్చేంత మంచి మనసు కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: