తెలుగు సినీ పరిశ్రమ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన యువ నటుల లో విజయ్ దేవరకొండ ఒకరు . ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్ర ల్లో నటించి నటుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఆ తర్వాత పెళ్లి చూపులు మూవీ లో హీరో గా నటించాడు . ఈ మూవీ మంచి విజయం సాధించడం తో హీరో గా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది . ఇక ఆ తర్వాత ఈ నటుడు అర్జున్ రెడ్డి అనే సినిమాలో హీరోగా నటించాడు . ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఒక్క సారిగా విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

మూవీ తర్వాత గీత గోవిందం , టాక్సీవాలా మూవీ లు కూడా విజయాలు అందుకోవడంతో ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ ఉన్న హీరోగా మారిపోయాడు. ఇకపోతే విజయ్ దేవరకొండ నటించిన సినిమాలలో ఏదైనా సినిమాకు నష్టాలు వచ్చిన సమయంలో ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన డియర్ కామ్రేడ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించాడు.

వరుస విజయాల తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా కావడంతో ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాకు పెద్ద మొత్తంలో నష్టాలు రావడంతో తాను తీసుకున్న రెమ్యూనరేషన్ నుండి చాలా బాగానే విజయ్ దేవరకొండ తిరిగి నిర్మాతకు వెనక్కినట్లు తెలుస్తుంది. ఇలా డియర్ కామ్రేడ్ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసును చాటుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd