సాదరణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కెరియర్ కాలం చాలా తక్కువగా ఉంటుందని చెబుతూ ఉంటారు. ఎందుకంటే దశాబ్ద కాలం గడిచిపోయింది అంటే హీరోయిన్లకు సీనియర్ అనే ముద్ర పడిపోతూ ఉంటుంది. దీంతో కొత్త హీరోయిన్లు రావడం పాత హీరోయిన్లు కనుమరుగవ్వడం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం. అయితే కొంతమంది హీరోయిన్లు చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తమ అందం అభినయం యాక్టింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొన్ని సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.



 కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఒక హీరోయిన్ ఫోటోలు ఇప్పుడు ఇలాగే అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. నాని హీరోగా నటించిన పిల్ల జమిందార్ సినిమా గుర్తుండే ఉంటుంది. యూత్ అందరికీ ఎంతో స్ఫూర్తిని నింపిన సినిమా ఇది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కి మంచి విజయం సాధించింది. అయితే ఈ మూవీలో నాని సరసన బిందు మాధవి, హరిప్రియ హీరోయిన్ గా నటించారు. బిందు మాధవి మోడ్రన్ గర్ల్ గా నాని గర్ల్ ఫ్రెండ్ పాత్రలో మెప్పిస్తే అచ్చమైన తెలుగు అమ్మాయి పాత్రలో సింధు కనిపించింది.


 తకిట తకిట అనే సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన హరిప్రియ పిల్ల జమిందార్ తో మంచి అందుకుంది. తెలుగులో అంతగా గుర్తింపు రాకపోయినా కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ హవా నడిపించింది. గత ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టింది ఈ హీరోయిన్. ప్రముఖ విలన్ కేజీఎఫ్ నటుడు వశిష్టతను పెళ్లి చేసుకుంది. అయితే ఇక ఇప్పుడు హరిప్రియ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. దీంతో ఆమె ఇలా మారిపోయింది ఏంటి అని అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా ఆమె ఫోటోలు చూసి కూడా గుర్తుపట్టలేకపోతున్నారు అభిమానులు.https://www.instagram.com/reel/C_vQwZ_IMLe/?igsh=MWhqYXdiYTNhMzY5cw==

మరింత సమాచారం తెలుసుకోండి: