అనగా వారు తెరకెక్కిస్తున్న రెండు మూడు సినిమాలకు లింకులు పెడుతూ అందులోని అంశాలను మిక్స్ చేస్తూ మరో సినిమా చేయడమే దాని సారాంశం. ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తనదైన యూనివర్స్‌ను క్రియేట్ చేసి, అందరి దృష్టిని ఆకర్శించగా, తెలుగులో డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ యూనివర్స్ అంటూ ఇప్పటికే హిట్, హిట్ 2 సినిమాలను తెరకెక్కించాడు. అదే విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో అదే మాదిరి సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి వారెవ్వా అనిపించాడు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ప్రశాంత్ నీల్ కూడా అదే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే వార్తలు గత కొన్నాళ్ళనుండి వస్తున్న సంగతి విదితమే.
అయితే ఈ విషయంలో కన్నడ సెన్సేషనల్ హీరో, “కేజీయఫ్” ఫేమ్ రాకింగ్ స్టార్ యష్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ భారీ హిట్ సినిమాలకి పార్ట్ 3 ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది అని తాజాగా ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్ చేసాడు. అదే విషయం తాజాగా యష్ చెప్పడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే సదరు యాంకర్ సాలార్, కేజీయఫ్ కనెక్షన్ గురించి మాట్లాడగా.. అలాంటిదేం లేదు.. ఈ రెండు సినిమాలకు లింక్ ఉండే ఆస్కారం లేదు! అంటూ క్లారిటీ ఇచ్చాడు.